కొవిడ్ కంప్యూటర్! మహమ్మారిని ఇట్టే పసిగట్టేస్తుంది..!

దిశ, ఫీచర్స్ : కొవిడ్-19ని గుర్తించగల కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాధనాన్ని యూకే పరిశోధకులు తాజాగా రూపొందించారు.

Update: 2022-07-10 14:06 GMT

దిశ, ఫీచర్స్ : కొవిడ్-19ని గుర్తించగల కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాధనాన్ని యూకే పరిశోధకులు తాజాగా రూపొందించారు. ఈ సాఫ్ట్‌వేర్ ఛాతీ CT స్కాన్‌లను విశ్లేషించి, వ్యాధిని కచ్చితంగా నిర్ధారించేందుకు 'డీప్ లెర్నింగ్ అల్గారిథమ్స్'ను ఉపయోగిస్తుంది. ఇది 97.86 శాతం కచ్చితత్వంతో ఫలితాలు ఇస్తుండగా, ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన కొవిడ్-19 డయాగ్నస్టిక్ టూల్ అని లీసెస్టర్ విశ్వవిద్యాలయం బృందం పేర్కొంది.

న్యూక్లియిక్ యాసిడ్ పరీక్ష లేదా PCR పరీక్షల ఆధారంగా కొవిడ్ నిర్ధారణ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షలు ఫాల్స్, నెగటివ్ రిజల్ట్స్ అందించే అవకాశముండటంతో పాటు ఫలితాలు హిస్టెరిసిస్ ద్వారా కూడా ప్రభావితమవుతుంటాయి. అందువల్ల వైద్యులపై భారాన్ని తగ్గిస్తూ కొవిడ్ కేసులను పెద్ద ఎత్తున వేగంగా పరీక్షించడం సహా, సమర్థవంతంగా పర్యవేక్షించడానికి ఏఐ అల్గారిథమ్స్ ఉపయోగిస్తోంది.

ఈ పద్ధతిలో ఛాతీలోని సస్పీయస్ రీజియన్స్‌ను ఆటోమేటిక్‌గా కనుగొని, రిప్రజెంటేషన్స్ ఆధారంగా కచ్చితమైన అంచనాలను వేయగలదని ఫలితాలు నిరూపించాయి. అందువల్ల COVID-19 నిర్ధారణ కోసం క్లినికల్ డయాగ్నసిస్‌లో దీనిని ఉపయోగించవచ్చు. ఇది వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో సాయపడవచ్చు. రాబోయే రోజుల్లో ఈ సాంకేతికతతో మాన్యువల్ జోక్యం అవసరం లేకుండానే ఆటోమేటెడ్ కంప్యూటర్ కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగలదు. అంతేకాదు క్లినిక్‌లలో రేడియాలజిస్టుల అవసరాన్ని కొవిడ్ కంప్యూటర్ తప్పకుండా భర్తీ చేస్తుంది. అందుకోసమే ఈ సాంకేతికతను మరింత అభివృద్ధి చేస్తున్నాం. స్మార్ట్‌ఫోన్స్ వంటి పోర్టబుల్ పరికరాల్లో కూడా అమలు చేయగల సాఫ్ట్‌వేర్, ఇతర వ్యాధులను (రొమ్ము క్యాన్సర్, అల్జీమర్స్ వ్యాధి, కార్డియోవాస్కులాలార్ వ్యాధులు... వంటివి) గుర్తించేందుకు, నిర్ధారించేందుకు కూడా వినియోగించుకునేలా రూపొందిస్తాం.

- డాక్టర్ యుడాంగ్ జాంగ్ 

Tags:    

Similar News