Renu Desai: ఆద్యతో క్యూట్ పిక్.. కొడుకు అకిరా ఆ పని చేస్తున్న ఫొటోని షేర్ చేస్తూ వెయిటింగ్ అంటున్న రేణు దేశాయ్(పోస్ట్)

పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మాజీ భార్య రేణు దేశాయ్(Renu desai) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Update: 2024-11-11 03:06 GMT
Renu Desai: ఆద్యతో క్యూట్ పిక్.. కొడుకు అకిరా ఆ పని చేస్తున్న ఫొటోని షేర్ చేస్తూ వెయిటింగ్ అంటున్న రేణు దేశాయ్(పోస్ట్)
  • whatsapp icon

దిశ, సినిమా: పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మాజీ భార్య రేణు దేశాయ్(Renu desai) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘జానీ’(Jonny), ‘బద్రి’(Bhadri) వంటి సినిమాల్లో పవన్‌ కళ్యాణ్ సరసన నటించి అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ కొన్ని కారణాల రీత్యా విడాకులు(Divorce) తీసుకుని వేరుగా ఉంటున్నారు. ఇక విడాకుల తర్వాత పవన్‌ కళ్యాణ్ మరో పెళ్లి చేసుకుని ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం(Deputy CM)గా వ్యవహరిస్తున్నాడు. ఇక రేణు దేశాయ్ మాత్రం మరో పెళ్లి చేసుకోకుండా తమ పిల్లల (ఆద్య, అకిరా నందన్) బాధ్యతలను చూసుకుంటుంది. అయితే గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈమె ‘టైగర్ నాగేశ్వరావు’(Tiger Nageswara Rao)మూవీతో సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. అయితే ఈ సినిమా తర్వాత మళ్లీ ఏడాది తర్వాత షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు తెలిపింది. అప్పటి నుంచి వాటికి సంబంధించిన ప్రతి అప్డేట్ ఇస్తూ వస్తుంది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ.. పేద పిల్లలకు, జంతువులకు సహాయం చేస్తుంది. తనకు తోచినంత సహాయం చేయడంతో పాటుగా.. తన ఫ్యాన్స్‌ను కూడా విరాళాలు అడుగుతూ ఉంటుంది. అలాగే సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఈమె పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

తాజాగా రేణు దేశాయ్ తన ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ చేసింది. అందులో ఆద్యతో బయటకు వెళ్ళినప్పుడు దిగిన క్యూట్ ఫొటోను రేణు దేశాయ్ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలాగే అకిరా జపనీస్ రైటర్ హరుకి మురకమి బుక్స్ చదువుతుండగా ఫేస్ కనపడకుండా ఫొటోస్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనికి.. ఆ రైటర్ బుక్స్ గురించి, రాబోయే బుక్స్ కోసం వెయిట్ చేస్తున్నా అనే క్యాప్షన్ కూడా జోడించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. అది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీటిపై ఓ లుక్ వేసేయండి.

Full View

Tags:    

Similar News