Remove hair: నొప్పి లేకుండా ఫేస్‌పై హెయిర్ తొలగించాలా..?బెస్ట్ చిట్కాలిదిగో
చాలా మంది అమ్మాయిలు(girls) ఎదుర్కొంటోన్న సమస్యల్లో అవాంఛిత రోమాలు(Unwanted hair) ఒకటి.
దిశ, వెబ్‌డెస్క్: చాలా మంది అమ్మాయిలు(girls) ఎదుర్కొంటోన్న సమస్యల్లో అవాంఛిత రోమాలు(Unwanted hair) ఒకటి. ఫేస్‌పై హెయిర్(face) పెరగడం సాధారణ సమస్యైనా ఈ విషయంలో అమ్మాయిలు చాలా కేర్ తీసుకుంటారు. పెదాల(lips)పైన గడ్డం(beard)లా, ముఖంపై జుట్టు(Facial hair) పెరుగడం వల్ల ముఖం అందం(face beauty) పోతుంది. కాగా పలువరు ముఖంపై హెయిర్ తొలగించడానికి పార్లర్‌కు వెళ్తూ ఉంటారు. థ్రెడ్డింగ్(Threading) తో.. లేకపోతే వ్యాక్స్(Wax) చేయించుకుంటారు.
కానీ జుట్టు తొలగించడం(hair removal) అంటే నొప్పితో కూడుకున్న పని. కాగా కొంతమంది పెయిన్ వస్తుందని బయపడి బ్యూటీ పార్లర్(Beauty parlour)కు వెళ్లకుండా ముఖంపై హెయిర్‌ను అలాగే ఉంచుకుంటారు. అయితే ఎలాంటి నొప్పి లేకుండా హోం రెమిడీలు(Home Remedies) వాడి ఈజీగా ఫేస్‌పై హెయిర్‌ను తొలగించుకోండి. నిపుణులు చెప్పిన సింపుల్ చిట్కాలేంటో ఇప్పుడు చూద్దాం..
పాలు-పసుపు: పాలు(Milk)-పసుపు(Turmeric) మిక్స్ చేసి.. పేస్టులా తయారు చేసుకుని ముఖంపై ఉన్న హెయిర్ పై రాసి అరగంట ఉంచుకోవాలి. అరిపోయాక చల్లని వాటర్‌తో క్లీన్ చేయాలి. ఇక హెయిర్ ఈజీగా తొలగిపోతుంది.
పంచదార-నిమ్మకాయ రసం: టేబుల్ స్పూన్ లెమన్ రసం(lemon) అండ్ పంచదార(sugar) తీసుకుని కలపండి. ఈ పేస్టును అప్పర్ లిప్(Upper lip) మీద, హెయిర్ ఉన్న చోట పెట్టాలి. పదిహేను నిమిషాలయ్యాక నార్మల్ వాటర్‌తో కడిగితే అవాంఛిత రోమాలు వదిలిపోతాయి
తేనె-నిమ్మకాయ రసం: టీస్పూన్ తేనె(honey)లో నిమ్మరసం(lemon) మిక్స్ చేసి.. పేస్టులా చేసుకుని ఫేస్‌పై అప్లై చేయండి. 20 మినిట్స్ అయ్యాక ముఖంపై గట్టిగా రుద్దుతూ క్లీన్ చేస్తే హెయిర్ తొలగిపోతుంది.
గోధుమ పిండి-పాలు: అవాంఛిత రోమాలను గోధుమపిండి(wheat flour) బెస్ట్ చిట్కా. గోధుమపిండి-పాలు(milk) కలిపి ముఖానికి రాసి.. 30 నిమిషాలు ఉంచి.. కూల్ వాటర్‌తో క్లీన్ చేస్తే మీ ముఖంపై ఉన్న వెంట్రుకలు పోతాయి.
శెనగపిండి-దాల్చిన చెక్కపొడి: శెనగపిండి(Peanut flour)ని ముందుగా నీటిలో కలిపి.. ఐదు నిమిషాలయ్యాక అందులో దాల్చిన చెక్క(Cinnamon) పొడి వేసి పేస్టులాగా చేసుకోండి. తర్వాత ఫేస్ క్లీన్ గా కడుక్కుని.. ఆ మిశ్రమాన్ని ఫేస్‌కు అప్లై చేయండి. ఎండిపోయినాక క్లీన్ చేస్తే హెయిర్ తొలగిపోతుంది.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులను సంప్రదించగలరు.