అమ‌రుడైన‌ జవానుకి రాఖీ క‌ట్టిన సోద‌రి.. గుండె క‌రిగే దృశ్యం!

ఇప్పుడు ఇంటర్నెట్‌లో ప్రజలను కంటతడి పెట్టించింది. Woman ties Rakhi on martyr Ganpat Ram Kadwasra's statue.

Update: 2022-08-11 13:00 GMT

దిశ‌, వెబ్‌డెస్క్ః రాఖీ పండుగను భారతదేశంలో ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు. తోడ‌బుట్టిన వారికే కాదు, అన్నా త‌మ్ముళ్ల అభిమాన‌మున్న వారి మ‌ణిక‌ట్టుకి రాఖీ కట్టి ఇరువురి మ‌ధ్య ఉన్న బంధం, బాధ్య‌త‌ల‌ను గుర్తుచేసుకుంటారు. అయితే, దేశవ్యాప్తంగా అంద‌రూ పండుగ జ‌రుపుకుంటుంటే, సోద‌రులను కోల్పోయిన‌ తోడ‌బుట్టిన అక్క‌లు, చెళ్ల‌ల ప‌రిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి! అయితే, అమరవీరుడు గణపత్ రామ్ కద్వాస్ర విగ్రహానికి ఓ మహిళ రాఖీ కట్టిన ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్‌లో ప్రజలను కంటతడి పెట్టించింది. ఇది ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో కుటుంబానికి దూర‌మైన‌ సోద‌రుల‌కి, దేశం కోసం ప్రాణాల‌ర్పించిన యుద్ధ వీరులకు అంకితభావం, భావోద్వేగ అనుబంధానికి సంకేతంగా నిలిచింది. ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న ఈ చిత్రంలో, కద్వాస్రా సోదరి అనుకుంటున్న ఒక మహిళ తన సోదరుడి విగ్రహానికి రాఖీ కట్టింది.

2017లో జమ్మూ కాశ్మీర్‌లోని తాంగ్‌ధర్ సెక్టార్‌లో సరిహద్దు కాల్పుల్లో అమరవీరుడు గణపత్ రామ్ కద్వాస్రా మరణించారు. ఆ మహిళ కద్వాస్రా సోదరి అని పేర్కొన్న వ్యాపారవేత్త వేదాంత్ బిర్లా లింక్డ్‌ఇన్‌లో ఈ ఫోటోను షేర్ చేసారు. అమరవీరుడు గణపత్ రామ్ కద్వాస్రా విగ్రహానికి మహిళ రాఖీ కట్టిన దృశ్యం నెటిజన్లను భావోద్వేగానికి గురి చేసింది. గుండెను కరిగించే వ్యాఖ్యలతో పోస్ట్ నిండిపోయింది.

అసలు రాఖీ ఆడవారే ఎందుకు కడుతారో తెలుసా ?


Similar News