ఆర్మీ రిక్రూట్‌మెంట్ లేద‌ని నిర‌స‌న‌గా ఇలా చేశాడు..?! (వీడియో)

వ‌య‌సు పెరుగుతుంది కానీ ఆర్మీ రిక్రూట్‌మెంట్ జ‌ర‌గ‌ట్లేదు. Rajasthan youth run Sikar to Delhi for 350 KM in 50 hours.

Update: 2022-04-06 10:32 GMT

దిశ‌, వెబ్‌డెస్క్ః ఇండియ‌న్ ఆర్మీలో చేరాల‌న్నది ఎంతో మంది యువ‌కుల క‌ల‌. అయితే, వారంతా కొన్నాళ్లుగా ఆర్మీ రిక్రూట్‌మెంట్ లేక నిరాశ‌తో ఉన్నారు. క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌స్తున్న ఆర్మీ రిక్రూట్‌మెంట్ అధికారుల‌పై ఈసారి దేశ యువ‌త కాస్త గుర్రుగానే ఉన్నారు. అందులో భాగంగానే ఓ యువ‌కుడు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ప్రారంభించాల‌ని విన్నూత్నంగా నిర‌స‌న చేప‌ట్టాడు. ఇండియ‌న్ ఆర్మీలో చేరాల‌నే ప‌ట్టుద‌ల‌తో రోజూ ర‌న్నింగ్ చేస్తున్నా వ‌య‌సు పెరుగుతుంది కానీ ఆర్మీ రిక్రూట్‌మెంట్ జ‌ర‌గ‌ట్లేద‌ని ఆవేద‌న‌తో ఈ నిర‌స‌నకు దిగాడు. రాజస్థాన్‌కు చెందిన సురేష్ భిచార్ అనే యువ‌కుడు సికార్ ప‌ట్ట‌ణం నుండి న్యూఢిల్లీకి, అంటే దాదాపు 350 కిలోమీటర్ల దూరం పరిగెత్తాడు. ఈ యువకుడు ప్ర‌య‌త్నంలో డిమాండ్ ఉన్న‌ప్ప‌టికీ, త‌న ప‌రుగు వెనుక ల‌క్ష్యం ఇండియ‌న్ ఆర్మీలో చేర‌డ‌మే అంటున్నాడు.

అయితే, 24 ఏళ్ల సురేష్ త‌న 350 కిలోమీటర్ల ప‌రుగును మొత్తం 50 గంటల్లో పూర్తి చేయ‌డం విశేషం. ఆర్మీ రిక్రూట్‌మెంట్ పరీక్షల‌ను వాయిదా వేయడంపై ఢిల్లీలో ఆర్మీ ఆశావాహులు నిర్వహిస్తున్న ప్రదర్శనలో పాల్గొనడానికి సురేష్ ఈ ప‌రుగును ప్రారంభించాడు. సురేష్ రాజ‌స్థాన్‌లోని నాగౌర్ జిల్లాకు చెందిన‌వాడు. ఇండియన్ ఆర్మీలో చేరాలనే కోరిక ఉన్నా రెండేళ్ల నుంచి నియామకాలు జరగక‌పోవ‌డంతో త‌మ చుట్టుప‌క్క‌ల ప్రాంతాలైన నాగౌర్, సికార్, ఝంఝ ప్రాంతాల్లో యువకుల వ‌య‌సు పెరిగిపోతుంద‌ని అస‌హ‌నంతో ఉన్నార‌నీ, యువతలో ఉత్సాహం పెంచేందుకు పరుగుపెడుతూ ఢిల్లీకి వచ్చాను అని అత‌డు మీడియాకు చెప్పాడు. సైన్యంలో చేర‌డానికి తాను ప్రతిరోజూ 5 నుంచి 7 గంటల పాటు పరిగెత్తుతాన‌ని అన్నాడు. ఇక‌, ఈ నిర‌స‌న పరుగులో సురేష్‌ ప్ర‌తిరోజూ ఉదయం 4 గంటలకు పరుగు ప్రారంభించి, ఉదయం 11 గంటలకు ఆపేవాడు. విశ్రాంతి స‌మ‌యంలో సమీపంలో ఉన్న ఆర్మీ ఔత్సాహికుల నుండి ఆహారం తీసుకునేవాడు. భారత సైన్యంలో చేరడమే ప్రధాన లక్ష్యం అయినప్పటికీ, సురేష్‌కు టెరిటోరియల్ ఆర్మీ (TA)లో భాగం కావాలని ఆశ‌.

Tags:    

Similar News