Rahul Gandhi: గుజరాత్‌లో మాఫియాను కాపాడుతోంది ఎవరు?
Rahul Gandhi Asks who is Protecting Spurious Liquor and Drugs Mafia In Gujarat| గుజరాత్‌లో అక్రమ మద్యం, మాదక ద్రవ్యాల వ్యాపారాల నిర్వహణపై కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఈ మాఫియాలను ఎవరు కాపాడుతున్నారని ప్రశ్నించారు. శుక్రవారం ట్విట్టర్
గాంధీనగర్: Rahul Gandhi Asks who is Protecting Spurious Liquor and Drugs Mafia In Gujarat| గుజరాత్‌లో అక్రమ మద్యం, మాదక ద్రవ్యాల వ్యాపారాల నిర్వహణపై కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఈ మాఫియాలను ఎవరు కాపాడుతున్నారని ప్రశ్నించారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా ఆయన ఇటీవల గుజరాత్‌లో జరిగిన ఓ ఘటనపై స్పందించారు. జులై 25న గుజరాత్‌లోని బొటాడ్, అహ్మదాబాద్ జిల్లాలకు చెందిన 42 మంది కల్తీ మద్యం సేవించి మరణించారు. దాదాపు 97 మంది ఇప్పటికీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని రాష్ట్ర హోంశాఖ సహాయ మంత్రి హరీష్ సంఘవి తెలిపారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. 'డ్రై స్టేట్'గా పిలవబడే గుజరాత్‌లో కల్తీ మద్యం, మాదక ద్రవ్యాలు రాజ్యం ఏలుతున్నాయన్నారు. పోలీసులు నిత్యం కొన్ని వేల కోట్ల విలువైన డ్రగ్స్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకుంటున్నారు. అయినా ఈ మాఫియా మరింత రెచ్చిపోతోంది. ఇదంతా చూస్తే దీని వెనుక పాలక శక్తుల హస్తం ఉన్నట్లు అనిపిస్తోంది. మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ పుట్టిన నేలపై ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడుతుంది ఎవరో తెలియాలి. ఈ మాఫియాను నడిపిస్తున్న వారిని వెంటనే గుర్తించి అరెస్ట్ చేయాలి.' అని డిమాండ్ చేశారు. కాగా, ఈ కేసులో పోలీసులు ఇప్పటికే 15 మందిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.
ఇది కూడా చదవండి: అఖిలేష్‌తో కేసీఆర్ భేటీ.. ఆసక్తికరంగా మారిన కీలక పరిణామం