బ్రేకప్ ఫుడ్.. అది తింటే రిలేషన్‌లో గొడవలు స్టార్ట్.. జాగ్రత్త!
దిశ, ఫీచర్స్ : నార్మల్‌గా స్కూల్ టీచర్.. 'మీకు నచ్చని ఫుడ్ ఐటెమ్ గురించి రాయండి?' అని హోమ్ వర్క్ latest telugu news..
దిశ, ఫీచర్స్ : నార్మల్‌గా స్కూల్ టీచర్.. 'మీకు నచ్చని ఫుడ్ ఐటెమ్ గురించి రాయండి?' అని హోమ్ వర్క్ ఇచ్చే ఉంటుంది. దీనికి సమాధానంగా చాలా మంది చాలా రకాలుగా రాసి ఉండవచ్చు. కానీ ఈ బుడ్డోడిలా ఇంత చక్కగా.. ఒక ప్యాటర్న్‌లో మాత్రం రాసి ఉండరు. ఇంతకీ తనకు ఇష్టం లేని ఫుడ్ ఏంటి.? మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి? అని చెప్తే కచ్చితంగా మీ పెదాలపై చిన్న చిరునవ్వు ఖాయమనే హామీ ఇస్తూ ఆ కథేంటో తెలుసుకుందాం.
500 పదాల వ్యాస రచనలో బుడ్డోడు చెప్పిన రీజన్ వైరల్ కాగా.. తనకు నచ్చని ఫుడ్ ఐటెమ్ 'పుట్టు' అని చెప్పుకొచ్చాడు. సాధారణంగా సౌత్ ఇండియా బ్రేక్ ఫాస్ట్(తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాలు)గా యూజ్ చేసే ఈ ఐటెమ్‌ను అన్నం, కొబ్బరి పొడి మిశ్రమంతో చేస్తారు. కాగా తనకు ఈ బ్రేక్ ఫాస్ట్ అంటే ఎందుకంత ఇరిటేషనో ఓ ఫ్లో చార్ట్ రూపంలో బ్యూటిఫుల్‌గా ప్రజెంట్ చేయడం విశేషం.
* కాస్త చల్లబడితే రాయిలాగా మారే పుట్టు తినడం నాకిష్టం లేదు
* అందుకని వేరే డిష్ చేయమని అమ్మని అడుగుతాను
* కానీ అందుకు తల్లి నిరాకరిస్తుంది.
* దీంతో ఆకలితో అలమటించి తనతో గొడవ పడుతాను.
* అమ్మ తిడుతుంది, చివరకు ఏడుస్తాను.
Puttu breaks relationship😂 pic.twitter.com/Bu10LkZfG3
— Elina - Mostly Ranting 🐼 (@LawyerInBaking) March 12, 2022
మోరల్ ఆఫ్ ది స్టోరీ.. పుట్టు బ్రేక్స్ ద రిలేషన్. ఎందుకంటే ఈ ఫుడ్ వల్లే తల్లికి, తనకు గొడవ అవుతుందని, ఇక్కడ 'పుట్టు' కల్‌ప్రిట్ అని వర్ణించాడు బుడ్డోడు. ఈ స్వీట్ స్టోరీ చదివిన నెటిజన్లు.. ఇంత ఇన్నోసెంట్ కిడ్‌ను ఓసారి చూడాలని ఉందంటున్నారు. ఇంకొందరేమో ఈ స్వీటెస్ట్ స్టోరీ నుంచి బయటకు రాలేకపోతున్నామని చెబుతున్నారు.
Puttu breaks relationship 💔💔💔💔😂😂Guys who want breakup.. But invite him/her... Make puttu and serve after five minutes... Done and Dusted relationship in a smart way 😎😎😎
— ImRaudra (@IRaudra) March 13, 2022