'తగ్గేదేలే' అంటున్న అప్పుడే పుట్టిన శిశువు

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు సినిమా పుష్ప సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ సినిమాలోని డైలాగ్‌లు,..telugu latest news

Update: 2022-03-09 16:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు సినిమా పుష్ప సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ సినిమాలోని డైలాగ్‌లు, స్టెప్స్ ఇప్పటికీ ఆన్‌లైన్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి. అల్లు అర్జున్ తన గడ్డం మీదుగా తన చేతిని పైకి పొనిస్తూ.. 'తగ్గేదేలే.. 'అన్న డైలాగ్‌కు ఇప్పటికీ క్రేజీ తగ్గలేదు. ప్రపంచవ్యాప్తంగా సాధారణ వ్యక్తుల నుంచి మొదలుకొని సెలబ్రిటీల వరకు దాని ఐకానిక్ డైలాగ్‌లు, పెప్పీ బీట్‌లపై వివిధ రీల్స్‌ను చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

ప్రస్తుతం అలాంటి రీల్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అప్పుడే పుట్టిన నవజాత శిశువు పుష్ప 'మెయిన్ జుకేగా నహీ'('తగ్గేదేలే.. ') కదలికను చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోలో పుష్ప మూమెంట్ చేస్తున్న నవజాత శిశువు కనిపిస్తోంది. 

వీడియోను పోస్ట్ చేసిన IAS అధికారి "యే తో పక్కా కభీ నహీ ఝుకేగా"(ఈ విశ్వాసం ఎన్నటికీ తలొగ్గదు) అని రాశారు. మూడు సెకన్ల పాటు ఉన్న ఈ క్లిప్‌ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది. దీనిపై కొంత మంది Twitter లో ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. అందులో, ఒకరు ఇలా రాశారు, "ఈ పాప.. తల్లి గర్భం నుండి #పుష్ప సినిమాను చూసింది" అని, మరొకరు శిశువును "చిన్న పుష్పా" అని కామెంట్స్ చేస్తున్నారు.



Tags:    

Similar News