భవిష్యత్తులో ''సైకాలజీ'' విద్యార్థుల మొదటి ప్రాధాన్యత: శ్రీనివాస్‌రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: మానసిక ఒత్తిడి ఆందోళనల నివారణకు నాణ్యత కలిగిన యువ సైకాలజిస్ట్‌ల latest telugu news..
దిశ, తెలంగాణ బ్యూరో: మానసిక ఒత్తిడి ఆందోళనల నివారణకు నాణ్యత కలిగిన యువ సైకాలజిస్ట్‌ల అవసరం ఉందని, భవిష్యత్తులో ఈ కోర్సు విద్యార్థుల మొదటి ప్రాధాన్యత గా తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మనస్తత్వవేత్తలు నిపుణుల సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఏఆర్పీపీ ఇండియా, జాతీయ స్థాయి సంస్థలు ఐరిష్ నేషనల్ ఫెయిర్, వన్ కాన్షియస్ ఇండియన్, ఫోరం ఫర్ ఏబుల్, సృష్టి ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి ఇంటర్ సైకాలజీ ని ఆదివారం నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు డాక్టర్ అట్ల శ్రీనివాస్‌రెడ్డి పలు అంశాలపై అవగాహన కల్పించారు. రానున్న కాలంలో సైకాలజీయే మొదటి ప్రాధాన్యత గా విద్యార్థులు చదివే అవకాశం ఉందని, దేశవ్యాప్తంగా ఇంటర్ చదువుతున్న వందల సంఖ్యలో విద్యార్థులు సైకాలజీ శిక్షణ లో పాల్గొనడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. కరోనా మహమ్మారి ఫలితంగా ఎన్నో రకాలైన విపత్కర పరిస్థితులను, మానసిక సవాళ్లను ప్రజలు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ వెబినార్‌లో డాక్టర్రాజీవ్ నంది, సంజనా సేత్, దేబ ప్రతిమ్, షరోన్, శ్రియ తదితరులు పాల్గొన్నారు.