అమెరికన్‌ సిటీలో వీధికి గ‌ణేష్ టెంపుల్ పేరు, సంబ‌రాలు చేసుకుంటున్న హిందువులు! (వీడియో)

భార‌తీయ హిందువుల‌కు ఇది నిజంగా ఒక పెద్ద గౌర‌వం. Proud moment for American Hindu people.

Update: 2022-04-06 12:16 GMT

దిశ‌, వెబ్‌డెస్క్ః ఇండియ‌న్స్ ఎక్కిడికెళ్లినా వారి సంస్కృతి, ఆచార వ్య‌వ‌హారాల‌ను కూడా తీసుకెళ్తార‌ని ఓ నానుడి. ముఖ్యంగా భార‌తీయ హిందువుల‌కు ఇది నిజంగా ఒక పెద్ద గౌర‌వం. ముఖ్యంగా అమెరికా వంటి అగ్ర‌దేశాల్లో కూడా ప‌దుల‌కొద్దీ హిందూ దేవాలయాల‌ను నిర్మించుకొని, అవిజ్ఞంగా పూజాపుర‌స్కారాల‌ను నిర్వ‌హిస్తుంటారు భార‌తీయ హిందువులు. ఈ క్ర‌మంలో అంద‌రికీ ఒక శుభ‌వార్త‌ను అందించారు న్యూయార్క్‌లోని హిందూ సంఘం. న్యూయార్క్‌లోని బోవ్న్ స్ట్రీట్‌కు 'గణేష్ టెంపుల్ స్ట్రీట్' అని పేరు పెట్టారు. వీధి అవ‌త‌ల‌ గణేష్ టెంపుల్ గా ప్రసిద్ధి చెందిన శ్రీ మహా వల్లభ గణపతి దేవస్థానం గౌరవార్థం ఈ వీధికి ఆ పేరు పెట్టారు. ఈ ఆలయం క్వీన్స్ కౌంటీలోని ఫ్లషింగ్‌లో ఉంది. ఈ దేవాలయం ఉత్తర అమెరికాలోని మొట్టమొదటి, పురాతన హిందూ దేవాలయాలలో ఒకటిగా, దీనిని 1977లో ఉత్తర అమెరికాలోని హిందూ టెంపుల్ సొసైటీ నిర్మించిందని చెబుతారు.

వీధి పేరును ఆవిష్కరించిన ప్రత్యేక వేడుకలో న్యూయార్క్‌లోని భారత కాన్సుల్ జనరల్ రణధీర్ జైస్వాల్, క్వీన్స్ బోరో ప్రెసిడెంట్ డోనోవన్ రిచర్డ్స్, న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్, దిలీప్ చౌహాన్, ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా, రిచర్డ్స్ ట్వీట్ చేశారు. రణధీర్ జైస్వాల్ ఈ మైల్‌స్టోన్ గురించి మాట్లాడుతూ, ఈ నామకరణ కార్యక్రమం కేవలం వేడుక మాత్రమే కాదని, "దశాబ్దాల తర్వాత ఈ మైలురాయిని చేరుకోవడానికి పడిన శ్రమను ఇది చూపిస్తుంది. ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీ, మీరు చేసినదంతా మీ కోసమే కాకుండా మీ చుట్టూ ఉన్న ప్రజల జీవితాలకు ఆనందాన్ని తెస్తుంది" అని పేర్కొన్నారు.



Tags:    

Similar News