Bunny Vas : రేవతి కుమారున్ని పరామర్శించిన 'పుష్ప' నిర్మాత
సంధ్య థియేటర్(Sandhya Theatre) వద్ద అల్లు అర్జున్(Allu Arjun) నటించిన పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో(Pushpa-2 Premiere Show) సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి(Revathi) అనే మహిళ మరణించగా.. ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం సంగతి తెలిసిందే.
దిశ, వెబ్ డెస్క్ : సంధ్య థియేటర్(Sandhya Theatre) వద్ద అల్లు అర్జున్(Allu Arjun) నటించిన పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో(Pushpa-2 Premiere Show) సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి(Revathi) అనే మహిళ మరణించగా.. ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం సంగతి తెలిసిందే. తాజాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రేవతి కుమారుడు శ్రీతేజను చిత్ర నిర్మాత బన్నీ వాస్(Producer Bunny Vas) పరామర్శించారు. బాలుడి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైద్య ఖర్చు అంతా తామే భరిస్తామని, బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని ఈ సంధర్భంగా బన్నీ వాస్ హామీ వారికి ఇచ్చారు. కాగా ఈ తొక్కిసలాట కేసులో నటుడు అల్లు అర్జున్ ను నిన్న చిక్కడపల్లి పోలీసులు(Chikkadpally Police) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నాంపల్లి కోర్టు (Nampally Court) బన్నీకి 14 రోజుల రిమాండ్ విధించగా.. చంచల్ గూడ జైలుకు తరలించారు. అప్పటికే అల్లు అర్జున్.. తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లు కొట్టి వేయాలని హైకోర్టు(High Court)లో క్వాష్ పిటిషన్(Quash Pitition)దాఖలు చేయగా.. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు అల్లు అర్జున్ కు వర్తించవని తెలిపిన కోర్ట్, మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే అప్పటికే బన్నీని పోలీసులు జైలు(ChanchalGuda Jail)కు తరలించగా.. విడుదల ప్రక్రియలో తీవ్ర జాప్యం జరిగి, నిన్న రాత్రి జైలులోనే ఉండాల్సి వచ్చింది. ఎట్టకేలకు నేటి ఉదయం విడుదలయ్యి ఇంటికి వచ్చాడు.