ఆ హీరోను పిచ్చోడిని చేసిన హీరోయిన్.. డ్రగ్స్‌కు బానిసై...
దిశ, సినిమా : ప్రతీక్ బబ్బర్- అమీ జాక్సన్ నటించిన ‘ఏక్ దివానా థా’ సినిమా సూపర్..laest telugu news
దిశ, సినిమా : ప్రతీక్ బబ్బర్- అమీ జాక్సన్ నటించిన 'ఏక్ దివానా థా' సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. 'ఏ మాయ చేశావే' రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ, మ్యూజిక్‌కు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ మూవీ టైమ్‌లోనే ప్రేమలో పడిన హీరోహీరోయిన్లు.. వన్ ఇయర్ తర్వాత బ్రేకప్ చెప్పేసుకున్నారు. దీంతో ఈ బాధ నుంచి బయటపడేందుకు డ్రగ్స్ మత్తులో ఉండిపోయిన ప్రతీక్.. సినిమాలకు కూడా దూరమైపోయానని చెప్పాడు. కానీ కొన్నాళ్ల తర్వాత రియలైజ్ అయి మళ్లీ కెరీర్ కొనసాగించానని చెప్పాడు. అమీ జాక్సన్ సింప్లిసిటీకి ఫిదా అయిపోయానని, ప్రపంచంలో మోస్ట్ గార్జియస్ గర్ల్ తనేనన్న ప్రతీక్.. కానీ 25ఏళ్లలో బ్రేకప్ తనను గట్టిగానే హిట్ చేసిందన్నాడు. కాగా 'బచ్చన్ పాండే'లో కీలక పాత్రలో కనిపించబోతున్న ప్రతీక్.. ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు.