Rahul Gandhi: 'ప్రజల సొమ్మును దోచే యోజన పథకం'.. రాహుల్ గాంధీ ట్వీట్ వైరల్
న్యూఢిల్లీ: కేంద్రం మరోమారు ఇంధన ధరల పెంచడంపై కాంగ్రెస్ సీనియర్ నేత..latest telugu news
న్యూఢిల్లీ: కేంద్రం మరోమారు ఇంధన ధరల పెంచడంపై కాంగ్రెస్ సీనియర్ నేత మరోసారి విమర్శలు చేశారు. రెండు వారాల్లో 12 సార్లు ధరల పెంపును ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రజలను దోచుకునే యోజన పథకంలో భాగమేనని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా 2014లో వాహనాలు ఫుల్ ట్యాంక్ ధరలనుద్దేశించి ట్వీట్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ ప్రధాన ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ప్రతి రోజు మోడీ ప్రభుత్వం ఉత్సాహం కంటే ద్రవ్యోల్బణం బాధను కలిగిస్తుందని అన్నారు. సోమవారం కూడా ఇంధన చోరీలో కొత్త వాయిదా ప్రకటించింది అని ట్వీట్ చేశారు. 'ప్రభుత్వం రెండు వారాల్లో పెంచిన ధరలతో లీటర్‌పై రూ.8.40 పెంచింది. బీజేపీకి ఓటు అంటే ద్రవ్యోల్బణం తప్పనిసరా' అని ప్రశ్నించారు.
Pradhan Mantri Jan Dhan LOOT Yojana pic.twitter.com/OQPiV4wXTq
— Rahul Gandhi (@RahulGandhi) April 4, 2022