కాసేపట్లో జిల్లాకు కేటీఆర్.. మూడు పార్టీల కీలక నేతలు అరెస్ట్

దిశ, తిమ్మాపూర్, మానకొండూరు, రామడుగు: రాష్ట్ర మంత్రి కేటీఆర్ కరీంనగర్ జిల్లా పర్యటన సందర్భంగా ప్రతిపక్ష పార్టీ నాయకుల ముందస్తు అరెస్టుల పర్వం కొనసాగుతోంది.

Update: 2022-03-17 05:58 GMT

దిశ, తిమ్మాపూర్, మానకొండూరు, రామడుగు: రాష్ట్ర మంత్రి కేటీఆర్ కరీంనగర్ జిల్లా పర్యటన సందర్భంగా ప్రతిపక్ష పార్టీ నాయకుల ముందస్తు అరెస్టుల పర్వం కొనసాగుతోంది. గురువారం తెల్లవారుజాము నుండే ప్రతిపక్ష పార్టీ నాయకులను స్టేషన్‌లకు తరలించే పనిలో పోలీసులు నిమగ్రం అయ్యారు. కరీంనగర్, చొప్పదండి, మానకొండూరు నియోజకవర్గాల్లో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీలకు చెందిన నాయకులను ముందస్తు అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలిస్తున్నారు. మూడు ప్రాంతాల్లో ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఏ ఒక్క నాయకుడు కూడా బయట ఉండకూడదని వారి ఇళ్లతో పాటు ఇతర ప్రాంతాల్లో పోలీసు బృందాలు జల్లెడ పడుతున్నాయి. రాష్ట్ర మంత్రి పర్యటన సందర్భంగా ప్రతిపక్ష పార్టీల నాయకులు చేపట్టే నిరసన కార్యక్రమాలను నిలువరించేందుకే ఈ అరెస్టుల పర్వం కొనసాగుతోందని ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ఇంత నిర్భందం అవసరమా అంటూ ఆయా పార్టీల నాయకులు ప్రశ్నిస్తున్నారు.

Tags:    

Similar News