పిల్లలను కనేందుకు ప్లాన్ చేస్తున్నారా..?
దిశ, ఫీచర్స్ : ఆధునిక యుగంలో మారుతున్న జీవనశైలి వల్ల రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి..Latest Telugu News
దిశ, ఫీచర్స్ : ఆధునిక యుగంలో మారుతున్న జీవనశైలి వల్ల రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇందులో ఒకటి సంతానోత్పత్తి సమస్య కాగా.. ఈ విషయంలో చాలా జంటలు బాధపడుతున్నాయి. అయితే దంపతుల గర్భధారణకు ఆటంకం కలిగించే అంశాలు చాలనే ఉంటుండగా.. సుఖంగా, చురుగ్గా గర్భం దాల్చేందుకు ప్రయత్నించే వారు ప్రతీరోజు చేసే చిన్న చిన్న విషయాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కాగా సంతానోత్పత్తిని ప్రభావితం చేసే కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం.
హౌస్‌హోల్డ్ కెమికల్స్ : (గృహ రసాయనాలు)
కొన్నిసార్లు ప్రమాదకరమైన పదార్థాలకు ఎక్స్‌పోజ్ కావడం వల్ల గర్భం దాల్చే అవకాశాలు 29% తగ్గుతాయి. అందులో ముఖ్యంగా టాక్సిన్స్, పురుగుల మందులు, ఇండస్ట్రియల్ కెమికల్స్‌తో పాటు PCBలు, థాలేట్లు, ఫ్యూరాన్ తరచుగా వంధ్యత్వానికి కారణమవుతున్నాయి. సాధారణం హోమ్ క్లీనింగ్‌కు యూజ్ చేస్తున్న ఉత్పత్తులలో ఈ పదార్థాలు ఉంటుండగా.. ఇవి లేకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.
సెక్సువల్ హిస్టరీ(లైంగిక చరిత్ర)
సరైన రక్షణ లేని లైంగిక కార్యకలాపాలు STD(Sexually transmitted diseases)లు సంక్రమించే అధిక ప్రమాదాన్ని పెంచుతున్నాయి. ఇందుకు ట్రీట్మెంట్ తీసుకోకపోతే ప్రాణాంతకమయ్యే ప్రమాదం ఉండగా.. వంధ్యత్వంపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా పునరుత్పత్తి వ్యవస్థకు ఆటంకం కలిగిస్తుంది. ఈ లైంగిక సంక్రమణ వ్యాధుల కారణంగా పురుషుల కంటే స్త్రీలలోనే ఎక్కువ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
స్ట్రెస్(ఒత్తిడి)
ఫ్యామిలీ ప్లాన్ చేస్తున్నపుడు స్ట్రెస్‌ని కంట్రోల్ చేసుకోవాలి. ఒత్తిడితో హార్మోన్ల స్థాయిలు పెరగడం వల్ల పురుషులు, స్త్రీల పునరుత్పత్తి వ్యవస్థలు రెండింటినీ నిరోధించవచ్చు. తద్వారా గర్భం దాల్చడం మరింత కష్టతరమవుతుంది.
స్మోకింగ్ (ధూమపానం)
దీర్ఘకాలంగా స్మోకింగ్ చేసేవారి ఊపిరితిత్తులకు హాని కలిగించడం, ఇతర అనారోగ్యాలపై సంక్రమించే ప్రమాదాలను పెంచడంతోపాటు దంపతుల సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుంది. స్మోకింగ్ కారణంగా మగవారి కంటే స్త్రీలు వంధ్యత్వాన్ని అనుభవించే అవకాశం ఉంది. ఇది పురుషులలో తక్కువ నాణ్యత గల స్పెర్మ్‌కు కారణమవుతుంది.
కెఫిన్
కాఫీ ఎక్కువగా తీసుకోవడం వల్ల స్పెర్మ్ ఉత్పత్తి తగ్గుతుంది. స్త్రీలలో ఈ పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. ఇది గర్భస్రావం ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. వంధ్యత్వంతో పోరాడుతున్న మహిళలకు మరింత హానికరం.
సంతానోత్పత్తిని ఎలా కాపాడుకోవాలి?
* క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన బరువును మెయింటెన్ చేయడం వలన అండోత్సర్గము, సంతానోత్పత్తి అవకాశాలు పెరుగుతాయి.
* ఏ ఒత్తిడి లేకుండా హాయిగా నిద్రించేందుకు ప్రయత్నించాలి.
* ఫైబర్ అధికంగా ఉండే ఫుడ్, ముదురు ఆకుపచ్చ కూరగాయలు తినాలి.
* మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలి.
* ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నప్పుడు పురుషుల స్పెర్మ్ నాణ్యత మెరుగుపడుతుంది- హార్వర్డ్ అధ్యయనం
* ఆహారంలో సంతృప్త లేదా ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటే.. పురుషుల స్పెర్మ్ నాణ్యత దెబ్బతింటుందని నిపుణులు స్పష్టం చేశారు.
* స్వీట్స్, చల్లని పానియాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల గర్భధారణపై ప్రతికూల ప్రభావం ఉంటుంది.