Narudi Brathuku Natana : ‘నరుడి బ్రతుకు నటన’ ట్రైలర్ రిలీజ్.. ఎలా ఉందంటే?

మంచి కథను మా ముందుకు తీసుకొస్తే హిట్ చేసే బాధ్యత మాది అంటూ ప్రేక్షకులు కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు.

Update: 2024-10-12 04:11 GMT

దిశ , వెబ్ డెస్క్ : మంచి కథను మా ముందుకు తీసుకొస్తే హిట్ చేసే బాధ్యత మాది అంటూ ప్రేక్షకులు కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. శివ కుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న ప్రధాన పాత్రల్లో నటించిన ‘నరుడి బ్రతుకు నటన’. టిజి విశ్వ ప్రసాద్, సుకుమార్ బోరెడ్డి, డాక్టర్ సింధు రెడ్డి నిర్మాణంలో రిషికేశ్వర్ యోగి డైరెక్షన్ లో ఈ మూవీ తెరకెక్కింది. శృతి జయన్, ఐశ్వర్య అనిల్ కుమార్, వైవా రాఘవ్.. నటీ నటులు ముఖ్య పాత్రలు పోషించారు.

తాజాగా నరుడి బ్రతుకు నటన సినిమా ట్రైలర్ ని మెగా డాటర్ నిహారిక కొణిదెల చేతుల మీదుగా లాంచ్ చేసారు. ట్రైలర్ చూస్తుంటే.. శివ కుమార్ బాగా డబ్బున్న వ్యక్తిలాగా కనిపిస్తున్నాడు. అతను నటుడిగా మారడానికి ప్రయత్నిస్తాడు , కానీ అతను విఫలమవుతాడు.. అందరూ అతన్ని నిరుత్సాహపరుస్తుండగా, జీవితం అంటే ఏంటో  తెలిస్తేనే నటన సాధ్యమని ఒక స్నేహితుడు అతనికి చెబుతాడు. అలా కేరళ లోని ఓ తెలియని ఊరికి వెళ్లి అక్కడ ఏం చేసాడనేది కథ. 

నరుడి బ్రతుకు నటన మూవీలో కేరళ అందాలతో పాటు కామెడీ, ప్రేమ, భావోద్వేగాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రం అక్టోబర్ 25న విడుదల కానుంది. తాజాగా విడుదల చేసిన నరుడి బ్రతుకు నటన ట్రైలర్‌ను మీరు కూడా చూడండి..

Full View

Tags:    

Similar News