Samantha: ఒక్కటి కాబోతున్న నాగచైతన్య- శోభిత ధూళిపాళ.. ఈ టైమ్‌లో పెళ్లి వీడియో షేర్ చేసిన సమంత

టాలీవుడ్ హీరో నాగచైతన్య(Naga Chaitanya), శోభిత(Shobhita Dhulipala) గత కొద్ది కాలం పాటు సీక్రెట్‌గా ప్రేమించుకున్న విషయం తెలిసిందే.

Update: 2024-10-26 08:15 GMT
Samantha: ఒక్కటి కాబోతున్న నాగచైతన్య- శోభిత ధూళిపాళ.. ఈ టైమ్‌లో పెళ్లి వీడియో షేర్ చేసిన సమంత
  • whatsapp icon

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో నాగచైతన్య(Naga Chaitanya), శోభిత(Shobhita Dhulipala) గత కొద్ది కాలం పాటు సీక్రెట్‌గా ప్రేమించుకున్న విషయం తెలిసిందే. ఇటీవల వీరిద్దరూ సడెన్‌గా ఎంగేజ్‌మెంట్(Engagement) చేసుకుని తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించి షాకిచ్చారు. అయితే ఈ నిశ్చితార్థం ఫొటోలు నాగార్జున(Nagarjuna) షేర్ చేయడంతో అంతా షాక్ అయ్యారు. ఇక ఈ వేడుక జరిగినప్పటి నుంచి నాగచైతన్య(Naga Chaitanya), శోభితకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఈ లవ్ బర్డ్స్ పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్లు త్వరలోనే వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నట్లు టాక్.

కానీ వీరు మాత్రం పెళ్లి ఎప్పుడనేది చెప్పకపోవడంతో దీనిపైనే నెట్టింట చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శోభిత ధూళిపాళ(Shobhita Dhulipala) పసుపు దంచుతున్న ఫొటోలు షేర్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో అక్టోబర్ చివరి వారంలో చైతు, శోభిత(Shobhita Dhulipala) పెళ్లితో ఒక్కటి కాబోతున్నారని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. పెళ్లి కూడా నిశ్చితార్థం చేసుకున్నట్లు చేసుకుంటారేమో? అని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. తాజాగా, శోభిత తన చెల్లి సమంత హల్దీ వేడుకల్లో పాల్గొన్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా  సమంత(Samantha) తన పెళ్లి వీడియోను కూడా షేర్ చేసింది. అయితే చైతు, శోభిత ఒక్కటి కాబోతున్న ఈ టైమ్‌లో సమంత పెళ్లి వీడియో షేర్ చేయడంతో అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఆమె సాహిల్(Sahil) అనే వ్యక్తిని రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. కానీ పెళ్లి వీడియోను మాత్రం ఇప్పుడు షేర్ చేసింది.

Full View

Tags:    

Similar News