Mahesh Babu: ‘ముఫాసా: ద లయన్ కింగ్’ కౌంట్‌డౌన్ స్టార్ట్.. మహేష్ బాబు ఇంట్రెస్టింగ్ ట్వీట్
‘ద లయన్ కింగ్’(The Lion King) ప్రపంచవ్యాప్తంగా ఎంతలా ప్రేక్షకాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
దిశ, సినిమా: ‘ద లయన్ కింగ్’(The Lion King) ప్రపంచవ్యాప్తంగా ఎంతలా ప్రేక్షకాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హాలీవుడ్(Hollywood)లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే ఇప్పుడు దీనికి ప్రీక్వెల్‌గా ‘ముఫాసా: ద లయన్ కింగ్’ (Mufasa: The Lion King) రాబోతుంది. ఈ మూవీ తెలుగు వెర్షన్‌తో పాటు తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో డిసెంబర్ 20న వరల్డ్ వైడ్‌గా విడుదల కాబోతుంది. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు మరింత స్పెషల్ కానుంది. ఎందుకంటే.. ముఫాసా పాత్రకు ఈ సారి సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) వాయిస్ అందించగా.. హిందీలో షారుఖ్ ఖాన్(Sharukh Khan) వాయిస్ ఓవర్ ఇచ్చారు.
బేరీ జెంకిన్స్(Barry Jenkins) దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని వాల్డ్ డిస్నీ స్టూడియో నిర్మించింది. ఇదిలా ఉంటే.. తాజాగా, మహేష్ బాబు హకునా మటాటా(Hakuna Matata) అంటూ ‘ముఫాసా: ద లయన్ కింగ్’ గురించి ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘మరో నెల రోజుల్లో రాబోతుంది. చూసేందుకు రెడీగా ఉండండి. హకునా మటాటా.. ముఫాసా అంటూ టిమోన్, పుంబా డైలాగ్ షేర్ చేశారు. అంతేకాకుండా ఓ వీడియోను కూడా షేర్ చేసి ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచారు.
Hakuna ̶M̶a̶t̶a̶t̶a̶ ̶ Mufasa it is!🦁 The new roar. 🎵
— Mahesh Babu (@urstrulyMahesh) November 20, 2024
1 Month from now, get ready to watch Mufasa: The Lion King in cinemas from 20th Dec.#MufasaTheLionKing @DisneyStudiosIN pic.twitter.com/pjdeugoXec