ఆసక్తిరేపిన ఇద్దరు లెజెండ్స్ డిస్కషన్.. ఆ ప్లేయర్ గురించి ఆరా

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్- 2022 సీజన్‌లో - MS Dhoni, Gautam Gambhir greet each other after LSG vs CSK match, fans react with memes

Update: 2022-04-01 11:44 GMT
ఆసక్తిరేపిన ఇద్దరు లెజెండ్స్ డిస్కషన్.. ఆ ప్లేయర్ గురించి ఆరా
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్- 2022 సీజన్‌లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్.. తన తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటన్స్ చేతిలో ఓటమిపాలైనప్పటికీ.. శరవేగంగా కోలుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తన రెండో మ్యాచ్‌లో టైటిల్ హాట్ ఫేవరెట్ చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించిన విషయం తెలిసిందే. అయితే రెండు జట్ల మధ్య మ్యాచ్ అనంతరం ఓ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. లక్నో జెయింట్స్ మెంటార్‌గా ఉన్న గౌతమ్ గంభీర్- మహేంద్రసింగ్ ధోనీను కలుసుకున్నాడు. ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దీనికి సంబంధించిన ఓ వీడియోను గౌతమ్ గంభీర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అది కాస్తా వైరల్‌గా మారింది. దీనికి వేలాదిగా లైక్స్.. కామెంట్స్ పడ్డాయి. ఇద్దరూ లెజెండర్స్ కలిశారంటూ కామెంట్స్ చేశారు.. ఫ్యాన్స్. ఈ వీడియోలో CSK మాజీ కెప్టెన్ ధోనీ LSG యువ ఆటగాడు అవేష్ ఖాన్‌, ఇతర అంశాల గురించి మాట్లాడుతున్నట్లు వీడియోలో చూడవచ్చు. వారు కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. అంతే కాదు, గంభీర్ స్వయంగా ధోనితో కలిసి ఉన్న ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ఆ పోస్ట్‌కు "సారథిని పట్టుకోవడం చాలా బాగుంది!" అంటూ.. క్యాప్షన్ ఇచ్చాడు.


Tags:    

Similar News