దిశ, నిజామాబాద్ రూరల్ : సీఎం కేసీఆర్ కు దమ్ము ధైర్యం ఉంటే నిజామాబాద్ సెగ్మెంట్లో ఐదు అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ పెట్టాలని ఎంపీ ధర్మపురి అరవింద్ సవాల్ విసిరారు. రెండు నెలల్లో టీఆర్ఎస్ పార్టీ అనాథగా మారి ఆ పార్టీలో ఎవరూ ఉండరని జోస్యం చెప్పారు. శివాజీ జయంతిని పురస్కరించుకుని దర్పల్లి మండల కేంద్రంలో శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వచ్చిన ఎంపీ అరవింద్ కు చేదు అనుభవం ఎదురైంది. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలనికి చేరుకోక ముందే అక్కడ ఉన్న బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు ఒకరినొకరు తోపులాట చేసుకొని, రాళ్ల దాడికి దిగారు. దీంతో దరిపల్లి పర్యటనను రద్దు చేసుకొని ఎంపీ ధర్మపురి అరవింద్ డిచ్ పల్లి మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఆధునిక ఔరంగజేబ్ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు నీటి ముటలేనని, స్త్రీలపై దాడి ఏంటని ప్రశ్నించారు. ఉద్యోగ నోటిఫికేషన్, దళిత బంధు వంటి ఎన్నో పథకాలు అమలు కాక రాష్ట్ర యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి సడక్ యోజన గ్రామాల్లో చేపటడంతోనే అభివృద్ధి పనుల్లో 90 శాతం కేంద్ర ప్రభుత్వ నిధులని గుర్తుచేశారు. తెలంగాణ పరిపాలనలో పసుపు మద్దతు ధర లేదని బాల్కొండ ఇలాకా మంత్రి ప్రశాంత్ రెడ్డి కి ఏం చేస్తున్నట్లు ప్రశ్నించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని ఇప్పటికీ.. ఆ ఊసే లేదన్నారు. అకాల వర్షాలతో జిల్లాలో పసుపు పండించి నష్టపోయిన రైతులను మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆదుకోవాలని.
తనపై దాడి చేస్తే రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు, రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డిలకు రాష్ట్ర ముఖ్యమంత్రి పదవులు వస్తే తానే వారి వద్దకు వెళ్లి దాడి చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. గతంలో భైంసాలో ఐదుగురు హిందువులను చితకబాదిన ఘటన ఇప్పుడు గుర్తుకు వస్తుందని భైంసాలో టీఆర్ఎస్ రాజకీయంగా ఓడిపోయిందని పేర్కొన్నారు. బీజేపీపై దాడి చేసేవారు కూడా హిందువు లేనని గుర్తుపెట్టుకోవాలని ఎంపీ ధర్మపురి అరవింద్ పునరుద్ఘాటించారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో హలాల్, ఇజాబ్, అజా, సూర్మా, సుంతి, కల్మ, ముస్లింలకు చెందిన ఈ ఆరు అంశాలు రాష్ట్రంలో అమలవుతున్నట్లు ఎంపీ అరవింద్ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం రాష్ట్ర జిల్లా ప్రజలకు ఛత్రపతి శివాజీ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఇన్చార్జి దినేష్, రాష్ట్ర నాయకులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్త, డిచ్ పల్లి బీజేపీ అధ్యక్షుడు వెంకటరమణ, బాల్కొండ బీజేపీ అధ్యక్షుడు మల్లికార్జున్ రెడ్డి, డిచ్పల్లి ఎంపీపీ గద్దె భూమన్న పాల్గొన్నారు.