పవర్ ఉన్నప్పుడు యువరాజు.. ఇప్పుడు తికమక రాజు.. కేటీఆర్‌పై MP అనిల్ సెటైర్
పవర్‌లో ఉన్నప్పుడు కేటీఆర్ యువరాజులా వ్యహరించాడని, అధికారం కోల్పోగానే మతిభ్రమంచి తికమక రాజులా మాట్లాడుతున్నాడని
దిశ, తెలంగాణ బ్యూరో: పవర్‌లో ఉన్నప్పుడు కేటీఆర్ యువరాజులా వ్యహరించాడని, అధికారం కోల్పోగానే మతిభ్రమంచి తికమక రాజులా మాట్లాడుతున్నాడని రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కవితను చూడటానికి వెళ్లిన కేటీఆర్, ఢిల్లీలో మీడియాతో మాట్లాడటం చూసి బాధ కలుగుతుందని వ్యంగ్యంగా విమర్శించారు. అసలు పార్టీ ఫిరాయింపులకు కారణం బీఆర్ఎస్, బీజేపీ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అడ్డగోలుగా కొనుగోలు చేసింది ఎవరు..? అంటూ ప్రశ్నించారు. బీజేపీ కూడా ఈడీ, సీబీఐలను ముందు పెట్టి ఫిరాయింపులకు పాల్పడిందన్నారు. కానీ తమ పార్టీలోకి ప్రజాపాలన విధానాలను చూసి వస్తున్నారని పేర్కొన్నారు. తామేవరినీ ప్రెజర్ పెట్టడం లేదని స్పష్టం చేశారు.