కొత్త చట్టాల వల్లే మహిళలపై ఎక్కువ హత్యలు: సీఎం అశోక్ గెహ్లాట్

జైపూర్: అత్యాచారం, మర్డర్లపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అత్యాచార బాధితులను మర్డర్ చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయని, వీటికి కొత్త చట్టాలే కారణమని ఆయన పేర్కొన్నారు.

Update: 2022-08-07 16:55 GMT

జైపూర్: అత్యాచారం, మర్డర్లపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అత్యాచార బాధితులను మర్డర్ చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయని, వీటికి కొత్త చట్టాలే కారణమని ఆయన పేర్కొన్నారు. దీంతో విపక్ష బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. గతవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ నిరసనల్లో అశోక్ గెహ్లాట్ ఈ వ్యాఖ్యలు చేశారు. 'నిర్భయ ఘటన తర్వాత అత్యాచార నిందితులను ఉరి తీయాలనే నినాదాలు పెరిగాయి. ఈ క్రమంలో కొత్త చట్టం అమలులోకి వచ్చింది. దేశంలో అత్యాచారానికి గురైన మహిళల హత్యల సంఖ్య గణనీయమైంది.' అని సీఎం పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం అవ్వడంతో సీఎం ఆఫీస్ స్పెషల్ డ్యూటీ అధికారి లోకేశ్ శర్మ వివరణ ఇచ్చారు. 'సీఎం చెప్పిన మాటలను తప్పుగా పరిగణిస్తున్నారు. అత్యాచార బాధితులు హత్యకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఎలాంటి వివాదం అనవసరం.' అని ఆయన పేర్కొన్నారు. కాగా, ఈ విషయంపై బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శించింది. గత మూడేళ్లల్లో రాజస్థాన్‌లో మహిళలపై నేరాల సంఖ్య పెరిగిందని, వాటిని కప్పిపుచ్చేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.


Similar News