చలాన్ల మెసేజ్ రావడం లేదా? మొబైల్ నెంబర్ చేంజ్ చేయాలా? ప్రాసెస్ ఇదే
దిశ, డైనమిక్ బ్యూరో : వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినప్పుడు పోలీసులు వారికి చలాన్లు విధిస్తుంటారు.
దిశ, డైనమిక్ బ్యూరో : వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినప్పుడు పోలీసులు వారికి చలాన్లు విధిస్తుంటారు. అయితే, చలాన్లు విధించగానే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు మెసేజ్ కూడా పంపిస్తుంటారు. ఈ క్రమంలో చలాన్లు చెల్లించేందుకు వీలుగా ఉండేది. అయితే, వాహనాలు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఇచ్చిన మొబైల్ నెంబర్ ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో చలాన్లకు సంబంధించిన సందేశాలను పొందలేరు. దీంతో పోలీసుల చెకింగ్‌లో వాహనంపై ఉన్న చలాన్లను చూసి తెలుసుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు వాహనాదారులకు మొబైల్ నెంబర్ చేంజ్ చేసే విధానంపై అవగాహన కల్పిస్తున్నారు. మొబైల్ నెంబర్ చేంజ్ చేసేందుకు ముందుగా.. https://transport.telangana.gov.in/ లింక్‌ను క్లిక్ చేయాలి. ట్రాన్స్పోర్ట్ డిపార్మ్‌మెంట్‌కు చెందిన వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత ఆన్లైన్ సర్వీస్ అండ్ పేమెంట్స్ క్లిక్ హియర్‌పై క్లిక్ చేయాలి. మరో విండో ఓపెన్ అవుతుంది.. అందులో అప్‌డేట్ మొబైల్ నెంబర్ పై క్లిక్ చేసి.. వెహికిల్ నెంబర్, చాసిస్ నెంబర్లలో చివరి ఐదు అంకెలతో లాగిన్ అవ్వాలి. అందులో మొబైల్ నెంబర్ చేంజ్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి అప్డేట్ మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేయాలి. అంతే మీ వాహనంపై పడే చలాన్లకు సంబంధించిన సందేశాలను ఇకపై కొత్త మొబైల్ నెంబర్ ద్వారా పొందవచ్చు.
ఈ లింక్ ద్వారా మీ ప్రస్తుత ఫోన్ నెంబర్ అప్డేట్ చేసుకోండి.
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) March 11, 2022
https://t.co/aQpKrAn07E pic.twitter.com/zWGoqqvXPr