ప్రభుత్వ పరిపాలనలో యువత భాగస్వాములవ్వాలి: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

దిశ ప్రతినిధి, నిజామాబాద్: యువత ప్రభుత్వ ఉద్యోగాలు - MLC Kalvakuntla Kavitha comments on Government notifications

Update: 2022-03-17 15:16 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: యువత ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి.. ప్రభుత్వ పరిపాలనలో భాగస్వాములు కావాలని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. హోలీ సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్సీ కవిత.. ప్రత్యేక వీడియో సందేశాన్ని గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సెర్ప్‌, మెప్మా, ఐకేపీ, మధ్యాహ్న భోజన కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సెర్ప్‌, మెప్మా, ఐకేపీ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వనున్నట్లు ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేశారు. సహజ రంగులతో పండుగ జరుపుకోవాలని సూచించారు.


తెలంగాణ వ్యాప్తంగా నిండు చెరువులు మత్తడి దునుకుతూ.. పాడి పంటలతో ప్రజలందరూ ఆనందోత్సాహాల మధ్య పండగను జరుపుకునే వాతావరణం తెలంగాణ ప్రభుత్వం లోనే ఏర్పడిందని కొనియాడారు. 80,039 ప్రభుత్వ ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు శాసన సభలో కేసీఆర్ ప్రకటించారని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. అటెండర్‌ నుంచి ఆర్డీవో వరకు స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారన్నారు.


అన్ని పోస్టుల్లో స్థానికులకు 95 శాతం రిజర్వేషన్‌ కల్పించనున్నట్లు ప్రకటించారన్నారు. ఐకేపీ ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇస్తామని సీఎం తెలిపారని గుర్తు చేశారు. 7,305 ఫీల్డ్ అసిస్టెంట్లకు తిరిగి ఉపాధినందించి సీఎం కేసీఆర్ గొప్ప మనసు చాటుకున్నారని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

Tags:    

Similar News