ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా ఫైర్ బ్రాండ్.. జగన్ పక్కన పెట్టేశాడా..?
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ- Latest Telugu News
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ హాట్ టాపిక్‌గా మారింది. సీఎం జగన్ ఆదేశంతో 24 మంది మంత్రులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీనితో కొత్త మంత్రి వర్గంలో ఎవరికి చోటు దక్కుతుందో అన్న అంశం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే వైసీపీలో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు 2019లోనే జగన్ క్యాబినెట్‌లో చోటు దక్కుతుందని వార్తలు వినిపించాయి. కానీ, అనుహ్యంగా రోజుకు మంత్రి పదవి దక్కలేదు. దీనితో ఆమెకు ఏపీఐఐసీ చైర్మన్ పదవి కట్టబెట్టారు.
అయితే, ప్రస్తుతం జరుగుతున్న ఏపీ క్యాబినెట్ విస్తరణలో ఎమ్మెల్యే రోజాకు ఖచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని అంతా ఊహించారు. కానీ, ప్రస్తుతం తెలిసిన సమాచారం ప్రకారం కొత్త మంత్రుల లిస్ట్‌లో రోజా పేరు లేదని తెలుస్తోంది. ఇప్పటికే కొత్తగా మంత్రి పదవి దక్కిన వారికి సీఎంవో కార్యాలయం నుంచి ఫోన్ వచ్చినట్లు.. వారిని అందుబాటులో ఉండాలని చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం రోజా హైదరాబాద్‌లోనే ఉండటంతో ఆమెకు మంత్రి పదవి దక్కలేదనే వార్తకు మరింత బలం చేకూరుస్తుంది. అయితే, ప్రభుత్వంపై, సీఎం జగన్‌పై కానీ.. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తే చెడుగుడుఆడుకునే రోజాకు మంత్రి పదవి దక్కకపోవడంతో ఆమె అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు.