దళిత బంధు కావాలా.. రాజ్యాధికారం కావాలా..? ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

దిశ, జడ్చర్ల: మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి - MLA Lakshmareddy made interesting remarks on the distribution of Dalit bandu units

Update: 2022-04-05 15:26 GMT

దిశ, జడ్చర్ల: మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దళితులకు దళిత బంధు కావాలా..? రాజాధికారం కావాలా..? అంటే దళిత బంధు వద్దు రాజ్యాధికారం కావాలి అంటున్నారు. రాజ్యాధికారం కొంతమందికే పరిమితం అయితే దళిత బంధు అందరికీ వర్తిస్తుందని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. కాంగ్రెస్ జెండా మువ్వన్నెల జెండా పెట్టుకోవడం ద్వారా జాతీయ జెండాను గౌరవించాలేకపోతున్నామని.. బీజేపీ జై శ్రీరామ్ అంటున్నందుకు మేము అనలేక పోతున్నామని ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆయన మంగళవారం.. జడ్చర్ల పట్టణంలో రూ. కోటి 48 లక్షల వ్యయంతో నూతన తహశీల్దార్ భవనానికి, రూ.4 కోట్ల 50 లక్షల వ్యయంతో వెజ్ అండ్ నాన్ వెజ్ సమీకృత భవనాలకు శంకుస్థాపన చేశారు.


అనంతరం ఉదండాపూర్ ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాలైన ఉదండాపూర్, వల్లూరు, ఖానాపూర్ గ్రామాల దళిత లబ్ధిదారులకు ఐదుగురికి రూ.50 లక్షల చెక్కును అందజేసి 100 దళిత బంధు యూనిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని ఓట్ల కోసం, రాజకీయం కోసమో ప్రవేశపెట్టలేదని దళిత బంధు కార్యక్రమం ద్వారా దళితులకు మేలు జరగడానికె కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారన్నారు. కానీ దళిత నాయకులు కూడా దళిత బంధు పథకం పట్ల ఆరోపణలు చేస్తూ ప్రతిపక్షాలకు లాభం చేకూర్చేందుకే విమర్శలు చేస్తున్నారని, దీంతో కేసీఆర్ ను తిట్టడమే ప్రతిపక్షాలు పనిగా పెట్టుకున్నారని ఆయన మండిపడ్డారు.

Tags:    

Similar News