వడ్లు కొనడం చేత కాకపోతే అధికారం నుండి తప్పుకోండి.. కేంద్రానికి ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సవాల్

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్/ నాగర్ కర్నూల్: మేము నూకలు తిన్నం.. ఆర్కలు తిన్నాం.. ఇప్పుడు దేశానికి అన్నం పెడుతున్నాం.. మీకు వడ్లు కొనడం చేత కాకపోతే

Update: 2022-04-07 12:06 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్/ నాగర్ కర్నూల్: మేము నూకలు తిన్నం.. ఆర్కలు తిన్నాం.. ఇప్పుడు దేశానికి అన్నం పెడుతున్నాం.. మీకు వడ్లు కొనడం చేత కాకపోతే అధికారం నుండి తప్పుకోండి.. రాష్ట్ర ప్రభుత్వమే అన్ని రాష్ట్రాల నుండి వడ్లు కుంటుందని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు. వరి కొనుగోలు విషయంలో కేంద్రం నిర్ణయాలను వ్యతిరేకిస్తూ జిల్లాల వారీగా నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా గురువారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నిరసన సభ నిర్వహించారు. ఇందులో మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. 'రైతులకు పుట్టినోళ్ళు అయితే ఈ గుండు గాడు.. పండుగాడు.. బండి గాడు మా రాష్ట్రంలో పండిన వడ్లను కొనమని కేంద్ర ప్రభుత్వానికి చెప్పాలే.. కానీ మనకు మనకు కొట్లాట పెట్టడానికి చూస్తున్నారని ఆరోపించారు.. కేసీఆర్ వడ్లు కొంనడం లేడని చెప్పడానికే నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు.. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు నీళ్లు, కరెంటు, పెట్టుబడి ఇచ్చిండు.. అందుకే పంటలు బాగా పండుతున్నాయి.. పండిన వరిని కొంటారా.. చేత కాకుంటే అధికారం నుండి తప్పుకోండి.. మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే అన్ని రాష్ట్రాల వరి ధాన్యాన్ని కొంటుంది' అని మర్రి జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు.


'పార్లమెంటు సాక్షిగా అన్నీ అబద్ధాలు మాట్లాడుతున్నారు.. కేంద్ర మంత్రి గోయల్ అయితే తెలంగాణ రైతులు నూకలు తినడం అలవాటు చేసుకోవాలని ఇటీవల ఆయనను కలిసిన మన రాష్ట్ర మంత్రులతో చెప్పాడు అని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గుర్తు చేశారు. అరే బేవకూఫ్.. మేము నూకలు దిన్నం.. ఆర్కెలు దిన్నం.. ఇప్పుడు దేశానికి అన్నం పెడుతున్నం అని మర్రి జనార్దన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ రైతులతో పెట్టుకున్నోడు ఎవడు బాగుపడలేదు.. కరెంటు ఇవ్వడానికి చేతకాని చంద్రబాబు నాయుడు బషీర్బాగ్ లో కాల్పులు జరిపించాడు.. ఆ తర్వాత ఆంధ్రోళ్లు వాత పెడితే ఇప్పుడు తన మనవడితో ఆడుకుంటున్నాడు' అని మర్రి జనార్దన్ రెడ్డి గుర్తు చేశాడు.. కేంద్రం వడ్లు కొనే వరకు పోరాటాలు ఆగవు అని మర్రి జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ గువ్వల బాలరాజు, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News