విద్యుత్ ఛార్జీల పెంపుదలను నిరసిస్తూ టీడీపీ ఎమ్మెల్యే భిక్షాటన..
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో విద్యుత్‌చార్జీల - MLA Gadde Rammohan comments on hike in electricity charges

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో విద్యుత్‌చార్జీల పెంపుపై రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నేతలు నిరసనలు చేపట్టారు. పేదలు విద్యుత్ చార్జీలు కట్టేందుకు దానం ఇవ్వాలంటూ భిక్షాటన చేస్తూ.. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. ఫ్యాన్‌కు ఓటేసిన వాళ్లు ఫ్యాన్ కూడా వేసుకోకూడదన్నట్లు ఏడుసార్లు విద్యుత్ చార్జీలు పెంచారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మండిపడ్డారు.

సిటీ బస్సులు ఆపి ప్రయాణికుల్ని బిచ్చమడిగారు. ప్రజలు మళ్లీ లాంతర్లతో బతికే రోజులొచ్చాయంటూ.. లాంతర్ల ప్రదర్శన చేపట్టారు. భిక్షాటన చేస్తే కానీ కరెంట్ బిల్లులు కట్టలేని పరిస్థితి రాష్ట్రంలో ఉందని గద్దె రామ్మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'జగన్‌రెడ్డి బాదుడే బాదుడు' విధానాలపై ప్రజా ఉద్యమం చేపడుతున్నామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్లడించారు.