దేశీయ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో గణనీయంగా పెరుగుతున్న మహిళలు!

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్) పరిశ్రమలో మహిళలా ఉద్యోగులు..latest telugu news

Update: 2022-03-06 15:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్) పరిశ్రమలో మహిళలా ఉద్యోగులు గణనీయంగా పెరుగుతున్నాయని ఓ నివేదిక వెల్లడించింది. మహిళా ఫండ్ మేనేజర్ల సంఖ్య 2017లో 18 మంది ఉండగా, ఈ ఏడాది ఇప్పటివరకు 32 మందికి చేరారని ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ మార్నింగ్ స్టార్ నివేదిక తెలిపింది. ఫండ్ పరిశ్రమలో ఉన్న మొత్తం ఉద్యోగుల్లో 8 శాతంతో గతం కంటే మెరుగ్గా ఉన్నారు.

అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా(ఏఎంఎఫ్ఐ) ప్రకారం.. మహిళా ఫండ్ మేనేజర్లు మొత్తం రూ. 4.55 లక్షల కోట్ల విలువైన మదుపర్ల ఆస్తులను నిర్వహిస్తున్నారు. ఇది మొత్తం మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ నిర్వహణ ఆస్తులు రూ. 38 లక్షల కోట్లలో 12 శాతమని, గతేడాది 13.5 శాతం నుంచి స్వల్పంగా క్షీణించిందని నివేదిక పేర్కొంది. దేశీయ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో 45 సంస్థలు ఉండగా, మహిళా ఫండ్ మేనేజర్ల సంఖ్య ప్రతి ఏటా పెద్ద ఎత్తున పెరుగుతోంది. మొత్తం పరిశ్రమలో కేవలం 8 శాతం మంది ఉండటం చాలా తక్కువే అయినప్పటికీ గత రెండేళ్లలోనే ఇది ఎక్కువగా పెరుగుతుండటం సానుకూల అంశంగా భావించవచ్చని మార్నింగ్ స్టార్ అభిప్రాయపడింది.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..