'పోచారం స్పీకర్ కాదు.. కేసీఆర్ ఇంట్లో స్వీపర్': మానాల మోహన్ రెడ్డి

దిశ, బాన్సువాడ: అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సీఎం కేసీఆర్ ఇంట్లో స్వీపర్‌లా - latest Telugu news

Update: 2022-03-13 13:49 GMT

దిశ, బాన్సువాడ: అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సీఎం కేసీఆర్ ఇంట్లో స్వీపర్‌లామారారని కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి సంచలన విమర్శలు చేశారు. వర్ని మండల కేంద్రంలో ఆదివారం రైతు దీక్ష కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొంగ నాటకాలు మానేసి, రబీ వరి ధాన్యం మొత్తం కొనాల్సిందేనని.. లేదంటే టీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు ఉరేస్తామని హెచ్చరించారు. స్పీకర్ పోచారంతో సహా ఆయన కొడుకులను రైతులు అడ్డుకుని, కట్టేసే పరిస్థితులు దగ్గరలోనే ఉన్నాయని పేర్కొన్నారు. పీసీసీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశానుసారం రైతుల పక్షాన పోరాటం చేస్తామని.. అకారణంగా కేసులు పెడితే తిరుగుబాటు తప్పదని తెలిపారు. అధికార పార్టీ తొత్తులుగా పోలీసులు మారొద్దని సూచించారు. స్పీకర్ కొడుకులు దొంగలుగా మారి ఇసుక, కంకర మాఫియా నడిపిస్తున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు కైలాష్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈనెల 20న ఎల్లారెడ్డిలో మన ఊరు - మన పోరు కార్యక్రమం తలపెట్టామని, ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి హాజరవుతారని చెప్పారు. కాంగ్రెస్ పాలనలోనే రైతు సంక్షేమం సాధ్యమని ధీమా వ్యక్తం చేశారు. రైతు రాజ్యం వచ్చేలా, తమతో నడవాలని అన్నదాతలను కోరారు.

కాంగ్రెస్ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి కాసుల బాలరాజు మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులను స్పీకర్ పోచారం అడుగడుగున ఇబ్బందుల పాలు చేస్తున్నారని విమర్శించారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, అంతకు అంత బదులు తీర్చుకుంటామని హెచ్చరించారు.

Tags:    

Similar News