గిన్నీస్ వరల్డ్ రికార్డు: మబ్బులను దాటి.. ఒట్టికాళ్లతోనే నడిచాడు! (వీడియో)
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఈ వీడియోను పోస్ట్ చేసింది. Man walks barefoot on slackline suspended 6,236 ft. in the air.
దిశ, వెబ్‌డెస్క్ః ఎవరైనా మబ్బులను తాకేటంత ఎత్తులో కనిపిస్తే... అక్కడున్నోళ్లకేమో గానీ చూసే వాళ్లకి కళ్లు తిరుగుతాయి. అలాంటిది, మబ్బులను దాటేసి వెళితే, తాడు మీద నడిచే ఫీట్ అంత ఎత్తులో, వట్టి కాళ్లతో, సన్నని తాడుపైన నడుస్తుంటే.. ఊహించుకుంటేనే వణుకుపుడుతుంది. అయితే, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఈ వీడియోను పోస్ట్ చేసింది. ఇటీవల ప్రపంచ రికార్డు ప్రయత్నం కోసం 'హయ్యస్ట్ స్లాక్‌లైన్ వాక్'కు సంబంధించిన అద్భుతమైన వీడియో అది. ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది. ఎంతో ఉత్కంఠభరితమైన ఈ వీడియో క్లిప్‌లో రాఫెల్ జుగ్నో బ్రిడి అనే 34 ఏళ్ల వ్యక్తి భూమిపై నుండి 6,236 అడుగుల ఎత్తులో ఈ ఫీట్ చేశాడు.
రెండు హాట్ ఎయిర్ బెలూన్‌ల మధ్య కట్టిన స్లాక్‌లైన్ తాడుపై చెప్పులు లేకుండా వట్టి కాళ్లతో నడిచాడు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం అయిన బుర్జ్ ఖలీఫా కంటే రెట్టింపు ఎత్తులో ఉంటుంది. గిన్నిస్ రికార్డు ప్రకారం 2021 డిసెంబర్ 2న, బ్రెజిల్‌లోని శాంటా కాటరినాలోని ప్రియా గ్రాండే మీదుగా 18 మీటర్ల పొడవు, 1 అంగుళం వెడల్పుతో ఉన్న స్లాక్ లైన్ మీద ఈ బ్రెజిలియన్ నడిచాడు. "ఈ అద్భుతమైన సాహసోపేతమైన ఫీట్ @rafabridi ఇన్‌స్టా ఖాతాలో కనిపిస్తుంది. ఈ ఉచిత సోలో (ISA-ధృవీకరించబడింది) ఫీట్ కోసం రికార్డ్ టైటిల్‌ను గెలుచుకుంది. మీరూ చూడండి..