హోటల్‌లో పనిచేసే వ్యక్తితో ప్రభుత్వ ఉద్యోగస్తురాలికి ఎఫైర్.. పక్కింటివాళ్లు గమనించడంతో..

దిశ, వెబ్ డెస్క్: వివాహతర సంబంధాలు ఎన్నో అనర్థాలకు దారి తీస్తాయి..Man held for killing live-in partner

Update: 2022-03-13 03:38 GMT
హోటల్‌లో పనిచేసే వ్యక్తితో ప్రభుత్వ ఉద్యోగస్తురాలికి ఎఫైర్.. పక్కింటివాళ్లు గమనించడంతో..
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: వివాహతర సంబంధాలు ఎన్నో అనర్థాలకు దారి తీస్తాయి. వారే కాదు వారి బంధువులు, వారి కడుపులో పుట్టిన పిల్లలు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతది. అది తప్పు అని తెలిసినా కూడా అటువైపు అడుగులు వేస్తూ ఇబ్బందుల పాలవుతున్నారు. అంతేకాకుండా వారి బంధువులను సైతం ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ లో జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణ.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ రాజీవ్ గాంధీ నగర్ లో కలిసి జీవిస్తున్న వారిద్దరూ తమ జీవిత భాగస్వాములను వదిలేశారు. ఆ సమయంలో వీరిద్దరూ ఒకరికొకరు పరిచయమయ్యారు. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆ తర్వాత ఓ అపార్ట్ మెంట్ లో ఇల్లును అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. అయితే, అతను హోటల్ చెఫ్ గా పనిచేస్తుండేవాడు. కరోనా సమయంలో అతడి ఉద్యోగం పోయింది. ఆమె ప్రభుత్వ ఉద్యోగిని కావడంతో అప్పటి నుంచి అతడి ఖర్చలకు ఆమెనే డబ్బులు ఇస్తూ ఉండేది. ఈ క్రమంలో అతను మద్యానికి బానిసయ్యాడు. ప్రతిరోజూ ఆమెను డబ్బులు కావాలని అడగడంతో వారిద్దరి మధ్య రోజూ గొడవలు అయ్యేవి. ఈ క్రమంలో గత నెల 27న కూడా వారిద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో అతను తీవ్ర ఆగ్రహానికి లోనై కత్తితో ఆమె గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. ఈ విషయాన్ని పక్కింటివారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకుని అతడి కోసం వేట ప్రారంభించారు. పదిరోజుల తర్వాత బస్టాండులో అతడిని అరెస్ట్ చేశారు. 

Tags:    

Similar News