పాత పెన్షన్ విధానం అమలు చేయండి: మామిళ్ళ రాజేందర్

దిశ, తెలంగాణ బ్యూరో: నూతన పెన్షన్ విధానాన్ని రద్దుచేస్తూ పాత పెన్షన్ విధానం అమలు చేయాలని- latest Telugu news

Update: 2022-03-29 16:56 GMT
పాత పెన్షన్ విధానం అమలు చేయండి: మామిళ్ళ రాజేందర్
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: నూతన పెన్షన్ విధానాన్ని రద్దుచేస్తూ పాత పెన్షన్ విధానం అమలు చేయాలని టీఎన్‌జీవో కేంద్ర సంఘ అధ్యక్షుడు మామిళ్ళ రాజేందర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రతిఘటిస్తూ మంగళవారం రెండో రోజు సార్వత్రిక సమ్మెకు మద్దతు తెలిపారు. నాంపల్లి టీఎన్‌జీవో భవన్‌ ఆవరణలో నల్ల బ్యాడ్జీలు ధరించి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆదాయపు పన్నును మినహాయింపును రెండున్నర లక్షల నుంచి పది లక్షల వరకు పెంచాలని, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ సమ్మెలో రామినేని శ్రీనివాస రావు, కిషన్, ఎస్ శ్రీరామ్, కె శ్రీకాంత్, వెంకట్ రెడ్డి, సుశీల్ బాబు, బండ్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News