Acharya: ఆచార్య ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. మెగా అభిమానులకు పండుగే!
దిశ, సినిమా: ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి- Latest Telugu News
దిశ, సినిమా: ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌లు కలిసి నటించిన చిత్రం ఆచార్య. అనేక వాయిదాల తర్వాత ఏప్రిల్ 29న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే, సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్ షూరు చేసింది. తాజాగా చాలా కాలం నుంచి తెరపై మెగాస్టార్‌ను చూడని అభిమానులకు ఆచార్య మూవీ యూనిట్ అదిరిపోయే అప్ డేట్ ఇచ్చింది.
ఏప్రిల్ 12న ఆచార్య సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్మేన్మెంట్స్ బ్యానర్‌తో కలిసి రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. ఈ మూవీలో చిరంజీవి, రామ్ చరణ్‌లు మాజీ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. ఇందులో చిరుకి జోడిగా కాజల్ అగర్వాల్.. రామ్ చరణ్‌కు జోడిగా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ చిత్రంపై సోషల్ మీడియాలో ఓ వార్త చెక్కర్లు కొడుతోంది. సినిమా లెంగ్త్ 3గంటలు ఉందని.. దీనిపై డైరెక్టర్‌తో చిరు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.