Hyderabad News: మహాలక్ష్మి వైన్స్ ఉదయం 9.30కే ఓపెన్
దిశ, నల్లకుంట : అంబర్ పేట నియోజకవర్గంలో వైన్ షాప్ నిర్వాహకులు నిబంధలను బేఖాతరు
దిశ, నల్లకుంట: అంబర్ పేట నియోజకవర్గంలో వైన్ షాప్ నిర్వాహకులు నిబంధలను బేఖాతరు చేస్తున్నారు. ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యం కారణంగా షాప్ యజమన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఉదయం 10 గంటల తర్వాత ఓపెన్ చేయాల్సిన లిక్కర్ షాప్ ను అంతకంటే ముందుగా ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ఓపెన్ చేస్తున్నారు. బుధవారం ఉదయం నియోజకవర్గంలోని అలీ కేఫ్ చౌరస్తా లో ఉన్న మహాలక్ష్మి వైన్స్ షాప్ నిర్వాహకుడు ఉదయం 9.30 గంటలకు షాప్ ఓపెన్ చేశారు. ఎక్సైజ్ శాఖ పట్టించుకోకపోవడంతో షాప్ నిర్వాహకులు ఇష్టం వచ్చినట్లు తెరుస్తున్నారు.
నియోజకవర్గంలో అన్ని లిక్కర్ షాపులది ఇదే తంతు కొనసాగుతుందని మందుబాబులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుస్తున్న లిక్కర్ షాపులు ముందుగా ఓపెన్ చేయడమేంటని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. వైన్ షాప్ ల పై నిఘా లేకపోవడం వల్లనే షాపు యజమానులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. సర్కార్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వైన్ షాప్ గుర్తించి ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.