ఇళ్లకు కన్నమేసి, బాత్‌రూమ్‌లో అవి ఎత్తుకెళ్తున్న వింత దొంగలు!!
దొంగతనంలో కూడా 64 కంటే ఎక్కువ రకాలే ఉంటాయేమో..?! Thieves scale houses, walk away with sewer lids and bathroom taps
దిశ, వెబ్‌డెస్క్ః 64 కళ్లల్లో ఒకటైన దొంగతనంలో కూడా 64 కంటే ఎక్కువ రకాలే ఉంటాయేమో..?! కొందరు దొంగలు డబ్బులు దొంగిలిస్తే, ఇంకొందరు బంగారం, మరికొందరు చెప్పులు, కోళ్లు, రకరకాల వస్తువులు, ఎక్సెట్రా... అలా చాలా.. ఇలాగే ఓ వింత దొంగల ముఠా దొంగతనం కోసం బాత్‌రూమ్‌లే వెతుక్కుంటున్నారంట. నిజమే..! లక్నోలోని ఇందిరా నగర్‌లోని అర డజను ఇళ్లలో ఓ యువకుల బృందం బాత్రూంలో దొంగతనాలకు పాల్పడుతుందని వింత వార్త పోలీసులకు అందింది. మాదకద్రవ్యాలకు బానిసలైన కుర్ర దొంగలు కొందరు బాత్‌రూముల్లో కుళాయిలు, మురుగునీటి గుంతల మూతలను దొంగిలిస్తున్నట్లు నిఘా కెమెరా ఫుటేజీలో కనిపించింది. ఈ దొంగ బడవలు ఇంకేమీ తీసుకెళ్లకపోవడంతో స్థానికులు ఇదేం విచిత్రమంటూ వాపోతున్నారు.
సీసీటీవీ ఫుటేజీలో దొంగలు ఇంటి సరిహద్దు గోడను పగులగొట్టి, లోపలికి చొరబడటం కనిపించింది. అయితే, ఇంటిలో మాత్రం ఏమీ పోలేదు, ఒక్క బాత్‌రూమ్ దగ్గరుండే ట్యాప్‌లు, సీవర్ మూతలే ఎత్తుకెళ్లారు. అయితే, చట్టపరంగా మ్యాన్‌హోల్-మూత దొంగతనాలు నేరమని నివేదించినప్పటికీ, ఇలాంటి దొంగతనం గురించి వినడం ఇదే మొదటిసారి అంటున్నారు పోలీసు అధికారులు. డ్రగ్ర్‌కు బానిసలైన వారు ఇలాంటి మ్యాన్‌హోల్ మూతలు దొంగిలించి, స్క్రాప్ డీలర్లకు విక్రయిస్తుంటారనీ, అయితే కుళాయిలను దొంగిలించడం వెనుక కారణాలేమిటో అర్థం కావడం లేదంటున్నారు పోలీసులు. ఏదేమైనప్పటికీ, ఫిట్టింగ్‌లు, వైర్లు, రైలు పట్టాలు వంటి వస్తువులు దొంగతనం చేసేవారు లేకపోలేదనీ, ఇంలాటి 11 లక్షల మంది దొంగలను ఇండియన్ రైల్వే అరెస్టు చేసిందని, వీళ్లను కూడా పట్టుకొని తీరతామని పోలీసులు తెలిపారు. పనిలో పనిగా కాస్ట్లీ అయిన స్టీల్ కుళాయిలు కాకుండా ప్లాస్టీక్ ట్యాప్‌లు వాడమని ప్రజలకు కూడా ఉచిత సలహా ఇచ్చారు పోలీసులు.