హైదరాబాద్‌లో $40 మిలియన్లు పెట్టుబడి పెట్టనున్న ప్రముఖ బ్యాటరీ సంస్థ

దిశ,వెబ్‌డెస్క్: లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ తయారీ సంస్థ సిగ్ని ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్..telugu latest news

Update: 2022-03-26 06:49 GMT
హైదరాబాద్‌లో $40 మిలియన్లు పెట్టుబడి పెట్టనున్న ప్రముఖ బ్యాటరీ సంస్థ
  • whatsapp icon

దిశ,వెబ్‌డెస్క్: లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ తయారీ సంస్థ సిగ్ని ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్‌లో కొత్త ప్లాంట్ పెట్టాలని నిర్ణయించుకుంది. సంవత్సరానికి 40,000 బ్యాటరీలను తయారు చేయగల సామర్థ్యంతో గ్రీన్‌ఫీల్డ్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. దీని కోసం సుమారు 40 మిలియన్ డాలర్ల (రూ. 300 కోట్లకు) పైగా పెట్టుబడి పెట్టనుంది. ఈ విషయాన్ని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాజా రామన్ ప్రముఖ మీడియా సంస్థకు తెలిపారు. రానున్న కాలంలో బ్యాటరీ వినియోగం ఎక్కువగా ఉంటుందని, మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల(EV)వాడకం పెరగడం వల్ల బ్యాటరీలకు డిమాండ్ ఏర్పడుతుందని రామన్ తెలిపారు. ఇప్పుడు రానున్న కొత్త ప్లాంట్ ద్వారా బ్యాటరీ తయారీ సామర్థ్యం నాలుగు రెట్లు పెరుగుతుందని, కాబట్టి భవిష్యత్తులో బ్యాటరీలను కావలసిన మొత్తంలో అందించడం సులభతరం అవుతుందని కంపెనీ పేర్కొంది. కంపెనీ ఇప్పటికే 2017 నుండి దాదాపు 125megawatt-hour, బ్యాటరీలను విక్రయించింది. "వచ్చే 5-7 సంవత్సరాల్లో 50 gigawatt-hour నిల్వ సామర్థ్యం అవసరమని సిగ్ని వ్యవస్థాపకుడు రాజా రామన్ తెలిపారు. లిథియం-అయాన్ బ్యాటరీ అభివృద్ధిలో భాగంగా కంపెనీ కొన్ని ప్రముఖ EV తయారీదారులతో కలిసి పనిచేస్తుంది. సిగ్నిలో ఎలక్ట్రిక్ టూ, త్రీ-వీలర్ కోసం దాదాపు 16 వేర్వేరు బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి. వీటిలో ఎనిమిది ఇప్పటికే స్థానిక టెస్టింగ్ ఏజెన్సీల ఆమోదం పొందాయి.

Tags:    

Similar News