పాపం నయనతార..పెళ్లితర్వాత సంతోషమే లేదు.. మరో వివాదంలో జంట

దిశ, వెబ్‌డెస్క్ : లేడి సూపర్ స్టార్ నయన తార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదం, అభినయం, నటనతో ఈ అమ్మడు ఎంతో మంది

Update: 2022-07-21 05:02 GMT

దిశ, వెబ్‌డెస్క్ : లేడి సూపర్ స్టార్ నయన తార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదం, అభినయం, నటనతో ఈ అమ్మడు ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఏ పాత్రలోనైనే ఇట్టే ఒదిగి బోయే నయన్.. సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక ఇటీవల ఈ అందాల ముద్దుగుమ్మ తన ప్రియుడైన విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కానీ పాపం ఈ అమ్మడు తన వివాహం తర్వాత వరసగా వివాదాల్లో చిక్కుకుంటుంది. పెళ్లైన కొత్తలో తిరుమల వెంకటేశ్వర స్వామి టెంపుల్‌‌కి చెప్పులు వేసుకొని వెళ్లడం ఎంత వివాదాస్పదం అయ్యిందో మనందరికి తెలిసిందే. ఈ విషయంలో టీటీడీ వారికి నయన్ క్షమాపణలు కూడా చెప్పింది. కాగా, నయన్, విఘ్నేష్ ఇప్పు మరో సారి చిక్కుల్లో పడ్డారు.

నయన్, విగ్నేష్ పెళ్లి వీడియో స్ట్రీమింగ్ హక్కులను ఓటిటి దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసుకుంది. ఒప్పందం ప్రకారం నయన్, విగ్నేష్‌ల పెళ్లి ఫోటోలను బయటకు రాకుండా చూసుకోవాలి. కానీ, పెళ్లి జరిగి నెల రోజులు కూడా పూర్తికాకుండానే, పెళ్లికి సంబంధించి కీలకమైన ఫోటోలను ఈ జంట సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఒప్పందానికి కట్టుబడి ఉండకుండా.. పెళ్లి ఫోటోలను లీక్ చేశారని నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ జంటపై ఆగ్రం వ్యక్తం చేసిందంట. అంతే కాకుండా పెళ్లి వీడియో టెలికాస్ట్ ఒప్పందాన్ని రద్దు చేసుకుందని తాజా టాక్ నడుస్తోంది. దీంతె పెళ్లి కోసం ఖర్చుపెట్టిన మొత్తాన్ని, అంతేకాదు ఒప్పందం ప్రకారం మాట్లాడుకున్న రూ. 25 కోట్లను తిరిగి చెల్లించాలని నెట్ ఫ్లిక్స్ ఈ జంటకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. 


Similar News