దూసుకెళ్తున్న కార్తికేయ.. ప్రముఖ బ్యానర్‌పై కొత్త సినిమా

దిశ,వెబ్ డెస్క్: ఆర్ఎక్స్ 100 మూవీతో ఓవర్‌నైట్ స్టార్ డమ్ అందుకున్న హీరో కార్తికేయ. ఆ సినిమా తర్వాత నుంచి కార్తికేయ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు

Update: 2022-04-08 17:11 GMT

దిశ,వెబ్ డెస్క్: ఆర్ఎక్స్ 100 మూవీతో ఓవర్‌నైట్ స్టార్ డమ్ అందుకున్న హీరో కార్తికేయ. ఆ సినిమా తర్వాత నుంచి కార్తికేయ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. కేవలం హీరోగానే కాకుండా విలన్‌గానూ మంచి మార్కులే కొట్టేశాడు ఈ యంగ్ హీరో. తాజాగా తమిళ సూపర్ స్టార్ అజిత్‌తో 'వలీమై'లో కనిపించాడు. ఈ సినిమా పర్వాలేదు అనిపించుకున్నా.. కార్తికేయకు మాత్రం ప్రశంసలే అందాయి. అయితే తాజాగా కార్తికేయ నెక్స్ట్ మూవీ అప్‌డేట్ వచ్చింది. తన తదుపరి సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ బ్యానర్ పై చేయనున్నాడు. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది. దీనికి సంబంధించి ఫస్ట్ పోస్టర్‌ను కార్తికేయనే స్వయంగా తన ట్విటర్‌లో షేర్ చేశాడు. దీనికి తాత్కాలికంగా కార్తికేయ 8 అని పేరు పెట్టారు. ఈ సినిమాతో ప్రశాంత్ రెడ్డి దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌లో ఉంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..