Karthika Deepam : కార్తీక్ మాటలకు ఎమోషనల్ అయిన దీప

కార్తీక దీపం ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్

Update: 2024-11-23 08:52 GMT

దిశ, వెబ్ డెస్క్ : కార్తీక దీపం ( Karthika Deepam ) ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్

‘నా కారణంగా మీరు ఇప్పటికే ఎంతో మందిని కోల్పోయారు. కానీ, ఇప్పుడు మీ సొంతూరును వదిలేస్తే.. ఎలా కార్తీక్ బాబు.. అది నాకు అసలు ఇష్టం లేదు బాబు’ అని దీప అంటుంది. అప్పుడు వెంటనే కార్తీక్ ఇలా మాట్లాడుతుంటాడు.. ‘నిజం చెప్పనా దీపా.. నేనెప్పుడూ నీ శ్రేయోభిలాషినే.. నేను మీకు దూరంగా ఉన్నప్పుడు కూడా మీరు ఎలా ఉన్నారు .. మీ జీవితం చక్కబడితే చాలు.. శౌర్య సంతోషంగా ఉండాలనుకున్నాను. నాకు వీటి కన్నా ఆనందం ఏది ఉండదని కార్తీక్ చెబుతాడు. కార్తీక్ మాటలకు దీప చాలా బాధ పడుతుంది.

" మనం ఇక్కడి నుంచి వెళ్లిపోయిన నష్టపోయేది ఏముంటుంది. అయినా ఆ జ్యోత్స్న మనల్ని అపార్ధం చేసుకుంటూనే ఉంటుంది.. ఏదో సందర్భాన్ని వాడుకుంటూనే ఉంటుంది " అని మాట్లాడుతూనే ఉంటాడు. కార్తీక్ మాటలకు దీపకు మాటలు కూడా రావు. కార్తీక్ అటుతిరిగి ఎమోషనల్ గా మాట్లాడుతూనే ఉంటాడు. అపుడు దీప చేతిలోని చీరను మంచం మీదకు వేసి.. కార్తీక్ వైపుగా నడుస్తుంది. కిందకు కూర్చుని.. కార్తీక్ కాళ్లకు దండం పెట్టుకోబోతుంటే వెంటనే అలానే కూర్చుని.. తాళిని తీసుకుని కళ్లకు అద్దుకుంటుంది. ఇక వెంటనే పైకి లేచి.. కార్తీక్ తో మాట్లాడుతుంటుంది. ఇక్కడితో ఈ సీన్ ముగుస్తుంది.

Tags:    

Similar News