Kangana: ఫలించిన కంగన ప్రయత్నం.. విడుదలకు సిద్ధమైన ‘ఎమర్జెన్సీ’ (పోస్ట్)

బాలీవుడ్ (Bollywood) ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకుంది హీరోయిన్ కంగనా రనౌత్ (Kangana Ranaut)

Update: 2024-10-17 15:36 GMT
Kangana: ఫలించిన కంగన ప్రయత్నం.. విడుదలకు సిద్ధమైన ‘ఎమర్జెన్సీ’ (పోస్ట్)
  • whatsapp icon

దిశ, సినిమా: బాలీవుడ్ (Bollywood) ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకుంది హీరోయిన్ కంగనా రనౌత్ (Kangana Ranaut). ప్రజెంట్ ఈమె రాజకీయాల్లో బిజీగా ఉంటూనే.. ‘ఎమర్జెన్సీ’ (Emergency) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తూ.. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ (Indira Gandhi) పాత్రలో కంగన కనిపించనుంది. అయితే.. ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. పలు కారణాల చేత పోస్ట్ పోన్ అవుతూనే వచ్చింది.

అయితే.. ఈ విషయంలో ఏ మాత్రం వెనకడుగు వెయ్యని కంగన.. ‘ఎమర్జెన్సీ’ (Emergency) సినిమాను రిలీజ్ చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా కంగన ప్రయత్నాలు ఫలించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సెన్సార్ (censor) కంప్లీట్ అయినట్లు తాజాగా ఓ పోస్ట్ పెట్టింది కంగన. ఈ మేరకు ‘మా సినిమా ‘ఎమర్జెన్సీ’ (Emergency)కి సెన్సార్ (censor) సర్టిఫికేట్ వచ్చిందని, త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. మా చిత్రం కోసం ఎంతో సహనంగా ఎదురుచూస్తూ.. మద్దతు ఇస్తున్న మీ అందరికి ధన్యవాదాలు’ అంటూ చెప్పుకొచ్చింది.

Tags:    

Similar News