Prasanth Varma:‘జై హనుమాన్’ క్రేజీ అప్డేట్ వచ్చేది అప్పుడే.. ట్వీట్‌తో హింట్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prashanth Verma) తెరకెక్కించిన ‘హనుమాన్’ సినిమా ఈ ఏడాది జనవరిలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

Update: 2024-10-23 10:10 GMT
Prasanth Varma:‘జై హనుమాన్’ క్రేజీ అప్డేట్ వచ్చేది అప్పుడే.. ట్వీట్‌తో హింట్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ
  • whatsapp icon

దిశ, సినిమా: టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prashanth Verma) తెరకెక్కించిన ‘హనుమాన్’(Hanuman) సినిమా ఈ ఏడాది జనవరిలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అంతేకాకుండా ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ దక్కించుకోవడంతో పాటు కలెక్షన్లు కూడా బాగానే రాబట్టింది.  ఇందులో టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా(Teja Sajja), అమృత అయ్యర్ జంటగా నటించగా.. వరలక్ష్మీ శరత్ కుమార్(Varalaxmi Sarathkumar) కీలక పాత్రలో నటించి మెప్పించింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ (Jai Hanuman)రాబోతున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా విడుదలైన విషయం తెలిసిందే.

ఇందులోంచి ఓ పోస్టర్ కూడా వచ్చి మంచి రెస్సాన్స్‌ను దక్కించుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’ (Jai Hanuman)నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. ఒక కోతి తన దగ్గరకు వచ్చిన పిక్ షేర్ చేస్తూ.. ‘‘మేము మళ్లీ కలిశాము ఇదే సంకేతం’’ అనే క్యాప్షన్ జత చేశాడు. అలాగే దీపావళికి ‘జై హనుమాన్’ (Jai Hanuman)సంబంధించిన అప్డేట్ రాబోతున్నట్లు హ్యాష్ ట్యాగ్‌తో ప్రశాంత్ వర్మ(Prashanth Verma) హింట్ ఇచ్చాడు. ఇక ఈ పోస్ట్ చూసిన వారంతా ‘జై హనుమాన్’(Jai Hanuman) అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News