IPL-2022 టైటిల్ విజేత ఆ జట్టే.. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్
దిశ, వెబ్‌డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు - Can Ravindra Jadeja-led CSK win their 5th IPL title? Matthew Hayden has THIS to say
దిశ, వెబ్‌డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు జడేజా నాయకత్వంలో గురువారం లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో తనపడనుంది. రెండు జట్లూ టోర్నమెంట్‌లో తమ మొదటి విజయం కోసం ఎదురు చూస్తున్నాయి. కొత్త IPL సీజన్‌కు కేవలం రెండు రోజుల ముందు MS ధోని కెప్టెన్సీని వదులుకున్న తర్వాత జడేజా ఇటీవల CSK కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్.. CSK జట్టు మరోసారి ఛాంపీయన్‌గా నిలుస్తుందా.. అనే విషాయాని స్టార్ స్పోర్ట్స్‌లో క్రికెట్ లైవ్ ఎపిసోడ్‌లో తన అభిప్రాయాని పంచుకున్నాడు.
నాలుగు సార్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఛాంపియన్స్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్సీలో మార్పు వచ్చినప్పటికీ ఐపీఎల్ 2022ను గెలుచుకుని టైటిల్‌ను నిలబెట్టుకోగలదని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్ అభిప్రాయపడ్డాడు. అయితే, ఈ సీజన్‌లోని మొదటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో CSK ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది, ఇందులో వారి బ్యాటింగ్, బౌలింగ్‌లో విఫలమయ్యారు.
"కెకెఆర్‌తో జరిగిన ఓపెనింగ్ గేమ్‌లో ఓటమితో సిఎస్‌కె నిరుత్సాహపడదు. రవీంద్ర జడేజా నేతృత్వంలోని జట్టుకు చాలా సానుకూలతలు ఉన్నాయి. వారి టాప్-ఆర్డర్ తొలి గేమ్‌లో అరుదైన బ్యాటింగ్ పతనాన్ని చవిచూసింది. తదుపరి గేమ్‌లో వారు మరింత బలంగా పుంజుకుంటారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను" అని స్టార్ స్పోర్ట్స్‌లో క్రికెట్ లైవ్ ఎపిసోడ్‌లో ఆసీస్ బ్యాటింగ్ లెజెండ్ హేడెన్ చెప్పాడు.