IPL| Rashid Khan: రషీద్ ఖాన్‌పై సన్‌రైజర్స్ కోచ్ ఆసక్తికర కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ గణాంకాలు - IPL 2022, Brian Lara feels Rashid Khan is Not Much Of A Wicket Taker

Update: 2022-04-25 11:36 GMT

IPL| Rashid Khan

దిశ, వెబ్‌డెస్క్: ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ గణాంకాలు చెబుతాయి.. అతను ఎలాంటి బౌలరో అని. ఐపీఎల్ టోర్నీలో ఎలాంటి బ్యాటర్లను అయిన తన బౌలింగ్‌తో బెంబేలెత్తిస్తాడు. తన స్పిన్ మాయజాలంతో మ్యాచ్‌ను మలుపు తిప్పగలడు. ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్న రషీద్ ఖాన్(Rashid Khan) శనివాం కోల్‌కత్తా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 వికెట్లు తీయడంతో.. ఐపీఎల్‌లో 100 వికెట్టు తీసిన బౌలర్ల జాబితాలో.. నాలుగో విదేశీ ప్లేయర్‌గా నిలిచాడు. ఐపీఎల్‌లో 2017 నుంచి 2021వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున రషీద్ ఖాన్ ఆడాడు. తన అద్భుత బౌలింగ్‌తో సూపర్ స్టార్ అయ్యాడు. సన్‌రైజర్స్‌కు ఆడిన 5 సీజన్‌లో రషీద్ 76 మ్యాచ్‌లలో 93 వికెట్లతో రాణించాడు. అయితే ఈ సీజన్ 2022లో సన్ రైజర్స్ రషీద్‌ను వదులుకోగా.. గుజరాత్ టైటాన్స్ అతన్ని రూ.15 కోట్లకు రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే.

ఐపీఎల్‌లో హవా కొనసాగిస్తున్న రషీద్ ఖాన్‌‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ కోచ్ బ్రియాన్ లారా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ''రషీద్ అంత పెద్ద వికెట్ టేకరేం కాదని, అతడు లేకున్నా తాము మ్యాచులు గెలుస్తున్నాం'' అని వ్యాఖ్యానించారు. రషీద్ ఖాన్‌పై నాకు చాలా గౌరవం ఉంది. రషీద్ ఇప్పుడు జట్టులో లేకున్నా.. మాకు సరైన కాంబినేషన్ ఉంది. రషీద్ బౌలింగ్ వేస్తున్నాడంటే ప్రత్యర్థి బ్యాటర్లు డిఫెన్స్ చేయాలని నిర్ణయించుకుంటున్నారు. అంతేకాని రషీద్ పెద్ద వికెట్ టేకరేం కాదు' అని అన్నారు.

Tags:    

Similar News