గోపీచంద్, సన్నీ డియోల్ మూవీకి ఆసక్తికర టైటిల్.. ఫస్ట్ లుక్ విడుదల

బాలీవుడ్ స్టార్ నటుడు సన్నీ డియోల్ (Sunny Deol)‘గదర్-2’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత నుంచి వరుస ప్రాజెక్ట్స్ అనౌన్స్ ఓకే చేస్తూ దూసుకుపోతున్నారు.

Update: 2024-10-19 10:26 GMT
గోపీచంద్, సన్నీ డియోల్ మూవీకి ఆసక్తికర టైటిల్.. ఫస్ట్ లుక్ విడుదల
  • whatsapp icon

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ నటుడు సన్నీ డియోల్(Sunny Deol) ‘గదర్-2’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత నుంచి వరుస ప్రాజెక్ట్స్ అనౌన్స్ ఓకే చేస్తూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే బోర్డర్-2(Border-2), ఎస్‌డీజీఎం సినిమాలు చేస్తున్న ఆయన.. తెలుగు దర్శకుడితో ఓ మూవీ చేస్తున్నారు. టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని(Gopichand Malineni) ఈ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతుండటం విశేషం. ఇందులో సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. దీనిని మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.

అయితే ఇందులో రణ్‌దీప్ హుడా(Randeep Hooda) విలన్‌గా సన్నీ డియోల్‌(Sunny Deol)తో తలపడబోతున్నాడు. దీనికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్(Taman) సంగీతం అందిస్తున్నారు. తాజాగా, ఈ చిత్రానికి ‘జాత్’(Jaat) టైటిల్ ఫిక్స్ చేసినట్లు మేకర్స్ వెల్లడించారు. అంతేకాకుండా నేడు సన్నీ డియోల్(Sunny Deol) పుట్టినరోజు కావడంతో ఆయన ఫస్ట్ లుక్‌ను కూడా షేర్ చేశారు. ఇందులో పవర్ ఫుల్ లుక్‌లో కనిపించిన సన్నీ లుక్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న జాట్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Tags:    

Similar News