'మరీ ఆ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి..?' కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి కౌంటర్..
దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ఘన విజయం సాధించి.. సీఎంగా- latest Telugu news
దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ఘన విజయం సాధించి.. సీఎంగా యోగి ఆదిత్యనాథ్ రెండవ సారి ప్రమాణం స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, జేపీ నడ్డా ఇతర బీజేపీ ప్రముఖ నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో స్మృతి ఇరానీ.. వేదికపై ప్రముఖ నేతలంతా కలిసి కూర్చొని ఉన్న సమయంలో ఓ ఫొటో తీసింది. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై ఆమె ఓ ట్వీట్ చేసింది. వారి ఫొటో నేను తీస్తే.. క్రెడిట్ మాత్రం ఎఎన్ఐ వార్త సంస్థకు వచ్చిందని పేర్కొంది. అయితే ఈ ట్వీట్‌కు ఇండియన్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బీవీ శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చాడు. 'మంత్రి గారు.. వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.400 నుంచి రూ.1000కి పెరిగింది.. మరీ ఈ క్రెడిట్ ఎవరికి ఇవ్వమంటారు?' అని సెటైర్ వేశాడు. దీనిపై నెటిజెన్లు రకరకాలుగా స్పందిస్తు్న్నారు.