డీఆర్డీవో ఎస్ఎఫ్‌డీఆర్ పరీక్ష విజయవంతం
భువనేశ్వర్: డీఆర్డీవో మరో క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది...telugu latest news
భువనేశ్వర్: డీఆర్డీవో మరో క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. సాలిడ్ ఫ్యుయల్ డక్టెడ్ రాంజెట్(ఎస్ఎఫ్ డీఆర్) ను శుక్రవారం ఉదయం చండీపూర్‌లో పరీక్షించారు. నిర్దేశిత లక్ష్యాలను క్షిపణి చేరుకుందని, అన్ని కీలకమైన భాగాల్లో విశ్వసనీయ పనితీరును విజయవంతంగా ప్రదర్శించినట్లు అధికారులు తెలిపారు. ఈ క్షిపణి సహయంతో సుదూర గగనతల ప్రమాదాలను లక్ష్యంగా చేసుకుని భగ్నం కలిగించవచ్చని చెప్పారు. ఈ క్షిపణిని డీఆర్డీవో తో పాటు, ఆర్సీఐ, హెచ్ఈఎంఆర్ఎల్ సంయుక్తంగా అభివృద్ధి చేశారు. ప్రయోగం విజయవంతం కావడం పట్ల కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ డీఆర్డీవో సిబ్బందిని అభినందించారు. దేశంలో కీలకమైన క్షిపణి సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధికి ఇది ఒక ముఖ్యమైన మైలురాయి అని అన్నారు.