డిజిటల్ షాపింగ్ కంపెనీల్లో పెట్టుబడులకు కేపిటల్ హబ్‌గా భారత్!

దిశ, వెబ్‌డెస్క్: డిజిటల్ షాపింగ్ కంపెనీల్లో పెట్టుబడులకు భారత్ రెండో అతిపెద్ద గ్లోబల్ వెంచర్..telugu latest news

Update: 2022-03-09 14:49 GMT
డిజిటల్ షాపింగ్ కంపెనీల్లో పెట్టుబడులకు కేపిటల్ హబ్‌గా భారత్!
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: డిజిటల్ షాపింగ్ కంపెనీల్లో పెట్టుబడులకు భారత్ రెండో అతిపెద్ద గ్లోబల్ వెంచర్ కేపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా మారిందని అధికారిక గణాంకాలు వెల్లడించాయి. బుధవారం విడుదలైన వివరాల ప్రకారం.. 2020లో ఈ పెట్టుబడులు రూ. 61 వేల కోట్ల నుంచి 2021 నాటికి 175 శాతం వృద్ధితో 22 బిలియన్ డాలర్ల(రూ. 1.68 లక్షల కోట్ల)కు చేరుకున్నాయి. గ్లోబల్ స్థాయిలో గత ఏడాది 51 బిలియన్ డాలర్లతో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, 14 బిలియన్ డాలర్లతో చైనా మూడో స్థానంలో, 7 బిలియన్ డాలర్లతో యూకే నాలుగో స్థానంలో ఉన్నాయి. భారత్ 2021లో డిజిటల్ షాపింగ్ విభాగంలో బెంగళూరు నగరం అత్యధికంగా 14 బిలియన్ డాలర్ల(రూ. 1.07 లక్షల కోట్ల) విలువైన వెంచర్ క్యాపిటల్ పెట్టుబడులను సాధించి, మొదటి స్థానంలో నిలవగా, రూ. 30 వేల కోట్లతో గురుగ్రాం 7వ స్థానం, రూ. 23 వేల కోట్లతో ముంబై 10వ స్థానంలో ఉన్నాయి.

బెంగళూరు నగరం 2020లో కంటే గతేడాది దాదాపు మూడు రెట్లు అధిక పెట్టుబడులను సాధించడం గమనార్హం. కరోనా మహమ్మారి పరిస్థితుల తర్వాత అంతర్జాతీయంగా ఆన్‌లైన్ కొనుగోళ్లకు పెరుగుతున్న డిమాండ్ ఈ-కామర్స్ కంపెనీలకు కలిసొచ్చిందని పరిశోధనా సంస్థలు తెలిపాయి. ప్రస్తుతం భారత్, యూకే దేశాల డిజిటల్ షాపింగ్ కంపెనీలు అత్యధికంగా పెట్టుబడులను సాధిస్తూ, యూనికార్న్ హోదాను సాధిస్తున్నాయని లండన్ అండ్ పార్ట్‌నర్స్ ఇండియా విభాగం డైరెక్టర్ హెమిన్ అన్నారు. అంతేకాకుండా అంతర్జాతీయంగా అత్యధిక యూనికార్న్‌లు కలిగిన టాప్-15లో భారత్ నుంచి మూడు నగరాలు ఉన్నాయని గణాంకాలు వెల్లడించాయి.

Tags:    

Similar News