చక్రాల కుర్చీలో 'కిలిమంజారో' అధిరోహించిన సాహసి

దిశ, ఫీచర్స్ : ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో సాధించాలని ఆశ పడుతుంటారు. అందుకు తగ్గట్లుగానే లక్ష్యాలను నిర్దేశించుకుంటారు.

Update: 2022-06-18 15:14 GMT

దిశ, ఫీచర్స్ : ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో సాధించాలని ఆశ పడుతుంటారు. అందుకు తగ్గట్లుగానే లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. కానీ, కొంత మంది ప్రయాణంలో వచ్చే ఆటుపొట్లు, అవరోధాలకు భయపడి వెనకడుగు వేస్తారు. తమవల్ల కాదని చేతులెత్తేస్తారు. నిజానికి సాధించాలనే కసి, తపన మనలో ఉంటే ప్రపంచమంతా ఏకమైనా మన విజయాన్ని అడ్డుకోలేరనేందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. చక్రాల కుర్చీలో మౌంట్ కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన మార్టిన్ విక్టరీ కూడా అందుకు నిదర్శనమే. ఐదేళ్ల క్రితం కొందరు వైద్యులు అతడు నడవడం అసాధ్యమని తేల్చిచెప్పారు. కానీ తన సంకల్ప బలంతో ఆఫ్రికాలోనే ఎతైన పర్వతాన్ని అధిరోహించి రికార్డ్ సృష్టించాడు.

ఐదేళ్ల క్రితం మాంచెస్టర్ అరేనాలో జరిగిన బాంబు దాడిలో 22 మంది మరణించగా, వందల మంది గాయపడ్డారు. ఆ క్షతగాత్రుల్లో మార్టిన్ హిబర్ట్ కూడా ఉండగా.. తన వెన్నుపాము పూర్తిగా దెబ్బతినడంతో నడుము నుంచి కిందివరకు పక్షవాతానికి గురయ్యాడు. అప్పటివరకు ఎంతో సంతోషంగా సాగిన అతడి జీవితం ఒక్కసారిగా తలకిందులైపోయింది. చక్రాల కుర్చీకే అంకితం కావల్సి వచ్చింది. అయినప్పటికీ మానసిక స్థైర్యం కోల్పోకుండా జీవితాన్ని ఆనందంగా కొనసాగించాడు మార్టిన్. అంతేకాదు తనలా బాధపడుతున్న వేలాదిమంది స్పైనల్ ఇన్‌జ్యూరీ పేషెంట్స్ కోసం ఏదైనా చేయాలని భావించాడు. వారి కోసం పనిచేస్తున్న 'స్పైనల్ ఇన్‌జ్యూరీస్ అసోసియేషన్' కోసం £1 మిలియన్‌ నిధులను సేకరించేందుకు కిలిమంజారో పర్వతాన్ని స్కేల్ చేసేందుకు సిద్ధమయ్యాడు. 45 ఏళ్ల మార్టిన్ తన సహాయకులు, స్థానిక గైడ్స్ బృందంతో కలిసి 5,895 మీటర్ల ఎత్తులో ఉన్న కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించాడు. ఈ ఘనత సాధించిన రెండో ప్యారలైజ్డ్ పర్సన్‌గా నిలిచాడు. ఈ మిషన్‌‌ను పూర్తి చేసిన తర్వాత కిలిమంజారో పర్వతంపై మార్టిన్ ఆనందంతో నృత్యం చేస్తూ తన విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం విశేషం.

Tags:    

Similar News