Health tips:గ్యాస్ సమస్య తొలగిపోవాలంటే.. యోగాలో ఈ ఆసనం చేయాల్సిందే?

దిశ, ఫీచర్స్: విభిన్న పద్ధతులున్న ఈ ఆసనంలో ఈ రోజు రెండో పద్ధతి ప్రయత్నం చేద్దాం. ముందుగా బల్లపరుపు నేలమీద వెల్లకిలా పడుకోవాలి..Latest Telugu News

Update: 2022-06-25 04:00 GMT

దిశ, ఫీచర్స్: విభిన్న పద్ధతులున్న ఈ ఆసనంలో ఈ రోజు రెండో పద్ధతి ప్రయత్నం చేద్దాం. ముందుగా బల్లపరుపు నేలమీద వెల్లకిలా పడుకోవాలి. శరీరాన్ని కాసేపు రిలాక్స్ చేయాలి. ఇప్పుడు రెండు కాళ్లను మోకాళ్ల దగ్గర మడిచి రెండు చేతులు ఇరువైపుల నేలపై పెట్టాలి. తర్వాత కుడి కాలును నెమ్మదిగా పైకి లేపుతూ కుడి చేతితో మోకాలు గుండా పట్టుకోవాలి. అలా చేతి సాయంతో కుడి మోకాలును వెనకకు బాడీవైపు లాగుతూ నేలపై ఆన్చాలి. ఈ భంగిమలో ఉన్నప్పుడు ఎడమకాలు, శరీరం కదలకుండా చూసుకోవాలి. తల ఆకాశంవైపు చూస్తుండాలి. ఇలా కాసేపు ఆగిన తర్వాత రిలాక్స్ అవుతూ మళ్లీ ఎడమకాలుతో ప్రయత్నించాలి.

ప్రయోజనాలు:

* రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

* జీర్ణక్రియ ఉత్తేజితమవుతుంది.

* వెన్నెముక, కండరాలకు మేలు.

* గ్యాస్ సమస్య తొలగిపోతుంది.


Similar News